టెస్లా సైబర్‌ట్రక్ భస్మీపటలం: డొనాల్డ్ ట్రంప్ హోటల్ వద్ద విధ్వంసం
Tesla Cybertruck: కొత్త సంవత్సరం తొలి రోజున అగ్రరాజ్యం అమెరికా అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. వరుస ఘటనలతో ఉలిక్కిపడింది. తొలుత- లూసియానాలోని న్యూ ఆర్లిన్స్ సిటీలో ఐసిస్ ఉగ్రవాది సృష్టించిన కారు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు.
క్రిక్కిరిసిన బోర్బన్ స్ట్రీట్‌లో ఫోర్డ్ పికప్ ట్రక్‌తో విధ్వంసాన్న సృష్టించాడు. కనిపించిన వారిని కనిపించినట్టే తొక్కుకుంటూ వెళ్లాడు. అనంతరం తుపాకీతో యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఆ ఉగ్రవాదిని టెక్సాస్‌కు చెందిన షంషుద్-దిన్ జబ్బార్‌గా గుర్తించారు. ఆ వాహనంపై ఐసిస్ జెండా ఉన్నట్లు నిర్ధారించారు.

దీని నుంచి తేరుకోకముందే లాస్ వెగాస్‌లో మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. టెస్లాకు చెందిన సైబర్‌ట్రక్ మంటలబారిన పడింది. పేలిపోయింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంస్థ.. టెస్లా. ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీ ఇది. గత ఏడాది సైబర్‌ట్రక్‌ను అభివృద్ధి చేసింది.
ఈ ట్రక్- లాస్ వెగాస్‌లో పేలిపోయింది. మంటల బారిన పడింది. అది కూడా ఆ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన హోటల్ వద్ద కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఏడుమంది గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే లాస్ వెగాస్ మెట్రో పోలీసులు, రెస్క్యూ విభాగం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. లాస్ వెగాస్‌కు చెందిన స్థానిక వ్యాపారసంస్థ ఒకటి దీన్ని టెస్లా నుంచి అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీన్ని ఉగ్రవాద ఘటనగా ప్రాథమికంగా నిర్ధారించారు.
సాంకేతిక లోపాల వల్ల ఈ పేలుడు సంభవించి ఉండదని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తోన్నట్లు లాస్ వెగాస్ మెట్రో షెరిఫ్ కెవిన్ మెక్‌మెహిల్ చెప్పారు. పేలుడు సంభవించిన సమయంలో మృతుడు సైబర్‌ట్రక్ లోపలే ఉన్నాడని, పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నామని అన్నారు.
సెకెండ్ డివైజ్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అనుమానిస్తోన్నట్లు కెవిన్ తెలిపారు. బయటి వ్యక్తులు సైబర్‌ట్రక్ బెడ్ భాగంలో ఈ సెకెండ్ డివైజ్‌ను అమర్చి ఉండొచ్చని పేర్కొన్నారు. సైబర్‌ట్రక్ అంతర్భాగంలో సంభవించిన లోపాల వల్ల పేలుడు సంభవించిందనడానికి ప్రాథమికంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని అన్నారు.
ఈ ఘటనపై టెస్లా యాజమాన్యం స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తానుగా ఈ సైబర్ ట్రక్ మంటలు, పేలుళ్లు, ఇతర ప్రమాదాల బారిన పడే అవకాశమే లేదని తెలిపింది. ఉగ్రవాద చర్య అయివుండొచ్చని పేర్కొంది. పేలుడు వస్తువులు లేదా త్వరగా మంటల బారిన పడే పరికరాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అంచనావేసింది.
Tesla’s Cybertruck explosion at the entrance to Trump International Hotel in Las Vegas was not a coincidence. Tesla’s are very safe and don’t just explode❗️❗️❗️ pic.twitter.com/SWVlUETD5D
— Eva McMillan ♥️ (@EvasTeslaSPlaid) January 1, 2025












Click it and Unblock the Notifications