రాజుకు 100మంది భార్యలు: తండ్రి భార్యలూ పెళ్లాలే
కెమరూన్: ఆఫ్రికాలోని కెమరూన్ దేశంలో బఫుట్ నే గిరిజన ప్రాంతముంది. ఇక్కడ ఓ వ్యక్తి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడి రాజుకు ఏకంగా వందమంది భార్యలు ఉన్నారు. మరో షాకింగ్ విషయం ఏమంటే తండ్రి మరణించిన తర్వాత... అక్కడ రాజు అయిన వారు తండ్రి భార్యలను కూడా భార్యగా చేసుకోవచ్చు.
ప్రస్తుతం అబుంది 2 రాజు భార్యల సంఖ్య వంద. ఆయన తండ్రి 72 మంది మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన 1968లో మృతి చెందాడు. తండ్రి చనిపోయిన తర్వాత.. అబుంది 2 వంద మందిని పెళ్లాడాడు. అందులో తండ్రి భార్యలు కూడా ఉండటం గమనార్హం.

దీంతో, వందమంది భార్యలు ఉన్న వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఆయనకు ఎంతమంది పిల్లలో వింటే కళ్లు తిరగాల్సిందే. ఆయన భార్యలందరికీ కలిపి 500 మంది సంతానం. అబుంది ఇక్కడి ప్రాంతానికి 11వ రాజు. అతను పెళ్లి చేసుకున్న వంద మంది భార్యల్లో తండ్రి భార్యలే ఎక్కువగా ఉన్నారు.












Click it and Unblock the Notifications