వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జికా' వైరస్ కలకలం: పుట్టుకలో లోపం, ఇవీ జాగ్రత్తలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: 'జికా' వైరస్ అమెరికాలో వేగంగా వ్యాప్తిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. 'జికా' వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వైరస్ సోకిన కేసులు 40 లక్షలకు చేరవచ్చునని భావిస్తున్నట్లు గురువారం డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.

బ్రెజిల్లో దాదాపు పది లక్షల మందిని చుట్టబెట్టి కలకలం రేపుతున్న జికా వైరస్‌ ఇతర ఖండాలకు విస్తరించింది. దోమకాటుతో వ్యాపించే ఈ వైరల్‌ వ్యాధి వల్ల సాధారణంగా ఎవరిలోనూ పెద్ద సమస్యలేమీ కనబడటం లేదుగానీ గర్భిణుకు ఈ వైరస్‌ సోకితే వారికి పుట్టే బిడ్డలకు తీవ్ర మెదడు లోపాలు తలెత్తుతున్నాయంటున్నారు.

దీంతో, జికా పేరు వింటూనే అందరూ భయపడుతున్నారు. బ్రెజిల్‌ కేంద్రంగా జికా విజృంభణ ప్రారంభమవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని నిలువరించే వ్యూహాలపై భారీ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకూ దీన్ని అడ్డుకోవటానికి టీకాలు లేవు. దీనికి ప్రత్యేకించి చికిత్స కూడా లేదు. ఇది 'ఈడిస్‌ ఈజిప్టై' రకం దోమల ద్వారా వ్యాపిస్తోంది. ఈ దోమలు మన ప్రాంతంలో విపరీతంగా ఉన్నాయి.

 The rare birth defect that's triggering panic over the Zika virus

జికా వైరస్ సోకితో తలనొప్పి, కీళ్ల నొప్పులు, జ్వరం, వాంతులు, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జికా వైరస్ ఒంట్లో చేరిన అందరిలోను లక్షణాలు కనిపించకపోవచ్చు. జ్వరం వంటి లక్షణాలు వారం రోజుల లోపు తగ్గిపోతాయి.

జికా వైరస్ సోకితే సాధారణ వ్యక్తులకు పెద్దగా ఏం కాదు. గర్భిణీలపై బాగా ప్రభావం చూపుతుంది. పైగా పుట్టే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. జికా బాగా ఉన్న బ్రెజిల్లో ఇప్పటికే వేలాది మంది పిల్లల్లో తల చిన్నగా, మెదడు లోపంతో పుట్టినట్లు అంచనా ఉంది.

విదేశాల నుంచి గర్బిణీలు జికా వైరస్ ఉన్న దేశాలకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. జికా వైరస్ లేకుండా చూసుకోవడానికి.. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. పెద్ద చేతుల చొక్కాలను ఒళ్లంతా కప్పుకోవాలి. దోమతెరలు వాడాలి. మన చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలి. కాగా, జికా పైన మన కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది.

English summary
The rare birth defect that's triggering panic over the Zika virus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X