ఆకాశం నుంచి కురిసిన కరెన్సీ నోట్లు: ఎగబడిన జనం, ట్రాఫిక్ జాం(వీడియో)
అబుదాబి: ఆకాశం నుంచి వర్షం కురిస్తే మామూలుగానే ఉంటుంది కానీ, కరెన్సీ నోట్లు కురిస్తే ఎలా ఉంటుంది. దుబాయ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆకాశం నుంచి హఠాత్తుగా కాసుల వర్షం కురిసింది. ఇంకేముంది మరో ఆలోచన లేకుండా జనాలు వాటిని ఏరుకునే పనిలో పడ్డారు. రోడ్డుపైన ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి వాటి వెంబడి పరుగెత్తారు.
కాగా, కారుల్లో ప్రయాణిస్తున్న వారు కూడా ఎక్కడి కార్లను అక్కడే నిలిపేసి ఆ నోట్లను ఏరుకునేందుకు పోటీపడ్డారు. ఫలితంగా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయిందట. అలా కురిసింది చిల్లర పైసలు కాదు. ఏకంగా 500 దినార్ల(దుబాయ్ కరెన్సీ) విలువైన నోట్లు... సుమారు 88 పాండ్లు...అలాంటి నోట్లు వందలు, వేల నోట్లు... కావడం విశేషం.

వాటి విలువ సుమారు రూ. 4.81 కోట్లు ఉంటుందని అధికారిక అంచనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లోని జుమీరా ప్రాంతంలో ఆ నోట్ల వర్షం కురిసిందని, అప్పుడు గాలి దుమారం, ఈదురు గాలులు బలంగా వీచాయని స్థానికులు తెలిపారు.

ఎక్కువ మంది నోట్లను ఏరుకోవడంలో నిమగ్నం కాగా, కొంత మంది ఆ దశ్యాలను తమ తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆకాశం నుంచి దాదాపు ఐదు లక్షల పౌండ్లు విలువైన కరెన్సీ కురిసినట్టు వెల్లడించిన అధికారులు మాత్రం అలా కాసులు కురవడానికి కారణం ఏమిటో మాత్రం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications