భారత్ తో గొడవల వేళ.. చైనాతో డొనాల్డ్ ట్రంప్ బిగ్ డీల్
Donald Trump Asia visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటన ప్రారంభమైంది. తన వాణిజ్య విధానాలతో ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన ఈ రీజియన్ దేశాలతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. దీనికి సంబంధించిన తేదీ గానీ, వేదిక గానీ ఇంకా ఖరారు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆసియాన్ సమ్మిట్ సైడ్ లైన్స్ లో భాగంగా ఈ భేటీ ఉంటుందని తెలుస్తోంది.
అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి వాషింగ్టన్ నుండి ఎయిర్ ఫోర్స్ వన్ లో ఆసియా దేశాల పర్యటనకు బయలుదేరారు డొనాల్డ్ ట్రంప్. మలేషియా, జపాన్, దక్షిణ కొరియా దేశాలలో అయిదు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసియాలో ఇది ఆయన తొలి పర్యటన కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే- ఆయన చేపట్టిన సుదీర్ఘ విదేశీ యాత్ర కూడా ఇదే.

ఈ పర్యటనలో భాగంగా వాణిజ్యం, ఖనిజాలు, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తోన్నారు. వీటి తర్వాతే దక్షిణ కొరియాలో గురువారం షీ జిన్‌పింగ్‌తో ముఖాముఖి సమావేశం ఉంటుందని చెబుతున్నారు. ఇజ్రాయెల్-గాజా ఘర్షణల్లో తాము కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలుపుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో వాణిజ్య యుద్ధం కూడా ముగిసే సూచనలు కనిపించట్లేదు.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. ఒకరి ఉత్పత్తులపై మరొకరు టారిఫ్ పెంచుకుంటూ పోయాయి. ఖనిజాలు, సాంకేతికతలలో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని కూడా ఈ రెండు దేశాలు చెప్పుకొచ్చాయి. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగిన ఈ రెండు దేశాలు వాణిజ్య యుద్ధానికి దిగడం వల్ల ఆసియా రీజియన్ లో కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. రెసిప్రోకల్ టారిఫ్ విధానాల వల్ల వాణిజ్యరంగం ప్రభావితమైంది.
2020లో ట్రంప్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో పొందుపరిచిన పలు అంశాలను చైనా ఉల్లంఘించింది. అదే సమయంలో చైనాపై 155 శాతం టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్. కొత్త టారిఫ్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. దీనికంటే ముందే- ట్రంప్ ఆసియా దేశాల పర్యటన చేపట్టడం, జిన్ పింగ్ తో సమావేశం అయ్యే అవకాశాలు ఉండటం వల్ల టారిఫ్ వ్యహారంలో అమెరికా ఓ అడుగు వెనక్కి వేయవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాకపోతే.. ట్రంప్- జిన్ పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ ఏర్పాటు కావడంపై స్పష్టత ఉండట్లేదు.
ఆసియా పర్యటనలో భాగంగా మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఆదివారం ప్రారంభం అయ్యే ఆసియాన్ సమ్మిట్‌లో ట్రంప్ పాల్గొననున్నారు. థాయ్‌లాండ్- కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించవచ్చు. అనంతరం ట్రంప్ జపాన్‌కు బయలుదేరి వెళ్తారు. కొత్తగా ఎన్నికైన ప్రధాని సనాయ్ టకైచీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత, దక్షిణ కొరియాలోని బుసాన్‌లో అంతర్జాతీయ వాణిజ్య సమ్మిట్ ఆరంభానికి ముందు జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని ట్రంప్ యోచిస్తోన్నారు.
-
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక











Click it and Unblock the Notifications