ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డీల్ ..! ఆ దేశాన్ని 100 ఏళ్లు కొల్లగొట్టేలా ట్రంప్ ప్లాన్..!

ప్రపంచాన్ని నడిపిస్తున్న కీలక అంశాల్లో ఒకటి చమురు. దీన్ని మరోసారి నిజం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ వ్యూహంతో ఓ దేశాన్ని బలవంతంగా చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత అందులో తనకు కావాల్సిన వ్యక్తిని అధ్యక్ష పదవిలో నియమించారు. చివరికి అదే వ్యక్తితో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా అమెరికాతో భారీ ఒప్పందం చేసుకున్న దేశం వెనెజులా (Venezuela). ట్రంప్ నియమించిన ఆ అధ్యక్షురాలి పేరు డెల్సీ రోడ్రిగ్స్.

వద్దన్న మోడీ- మర్చిపోయి చెప్పేసిన ట్రంప్- మళ్లీ తెరపైకి ఆ ఎపిసోడ్..!
వద్దన్న మోడీ- మర్చిపోయి చెప్పేసిన ట్రంప్- మళ్లీ తెరపైకి ఆ ఎపిసోడ్..!

వెనెజులాలో ఇప్పటివరకూ వెలికితీయని భారీ చమురు నిల్వల్ని బయటకు తీయడంతో పాటు వాటిని తనకు కావాల్సిన ధరకు అమెరికాకు తరలించుకుపోయేందుకు వీలుగా ట్రంప్ భారీ డీల్ కుదుర్చుకున్నారు. తమ ప్రభుత్వం వెనిజులాతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుందని, ఇది కార్యరూపం దాల్చితే, ఆ దక్షిణ అమెరికా దేశంలోని వెలికితీయని భారీ చమురు నిల్వలను అమెరికా కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తుందని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడే వెనిజులా దేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Trump Claims Biggest Oil Deal in World History in New Venezuela Pact
US-Iran War: ఇరాన్ పై అమెరికా ఆంక్షల్లో చిక్కుకున్న 4 భారతీయ కంపెనీలివే..!
US-Iran War: ఇరాన్ పై అమెరికా ఆంక్షల్లో చిక్కుకున్న 4 భారతీయ కంపెనీలివే..!

అటు వెనెజులాలో డెల్సీ రోడ్రిగ్స్ ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. ఈ ఒప్పందంలో 65 బిలియన్ బ్యారెళ్ల నిరూపిత సామర్థ్యం గల 17 క్షేత్రాల అభివృద్ధి ఉందని వెల్లడించింది. ఈ ఒప్పందం వెనిజులా చమురు పరిశ్రమలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలదని, కారకాస్‌కు 209 బిలియన్ డాలర్లకు పైగా పన్నుల ఆదాయం తెచ్చిపెడుతుందని పేర్కొంది. తాజా ఒప్పందం మేరకు అమెరికా-వెనెజులా కలిసి ఓ ఉమ్మడి సంస్ధను ఏర్పాటు చేస్తాయి. వెనిజులాలో ని ఓ రహస్య ప్రైవేట్ ఆపరేటర్‌తో ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సంస్థ ద్వారా వెనెజులాలో ఓ రహస్య ఆపరేటర్ కు చమురు నిల్వల్ని వెలికితీసి అందించే బాధ్యతల్ని ఇరు ప్రభుత్వాలు అప్పగిస్తాయి. చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి రోడ్రిగ్జ్ ఆ కంపెనీకి 100 సంవత్సరాల హక్కులను మంజూరు చేశారు.

వెనెజులాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. వెనెజులాలో 303 బిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ నిల్వలున్నట్లు అమెరికా అధికారిక అంచనా. ఇది ప్రపంచంలో ఉన్న చమురు నిల్వల్లో 17 శాతం. కానీ ఈ నిల్వల్ని వెలికి తీయకపోవడం వల్ల ప్రపంచానికి కేవలం 1 శాతం చమురును మాత్రమే వెనెజులా అందిస్తుంది. ఇప్పుడు మిగిలిన నిల్వల్ని వెలికితీసి, తక్కువ ధరకు కొల్లగొట్టేందుకు అమెరికా ప్లాన్ చేసింది. వెనెజులాలో ఉన్న 303 బిలియన్ బ్యారెళ్ల చమురులో 65 బిలియన్ బ్యారెళ్లను వెలికితీసేందుకు అమెరికా ఈ ఒప్పందం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+