అదృష్టం అంటే ఆ చిన్నారిదే.. లక్కీ డ్రా తీసిన చిన్నోడి కుటుంబానికే ఇల్లు..
హైదరాబాద్ లో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆశలు పెట్టుకున్న పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి కలను నెరవేర్చేందుకు ముందడుగు వేసింది. రాఖీ పండుగ శుభవేళ హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ లో ఫ్లాట్ల కేటాయింపునకు చేపట్టిన లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్ దేవుపల్లి లక్ష్మీగూడలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. లక్కీ డ్రా టోకెన్ ను ఓ చిన్నారితో తీయించగా ఆ బాలుడి కుటుంబాన్నే ఇల్లు వరించడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి పొంగులేటి తన అధికారిక ఖాతాలో పోస్టు చేశారు.
అదృష్టం అంటే ఇదేనేమో..
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) August 28, 2026
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా టోకెన్ ను ఒక చిన్నోడితో తీపించినపుడు ఆ చిన్నోడి కుటుంబానికే వరించిన ఇల్లు.
పేదల సొంతింటి కల తీర్చాలనే ఈ ప్రభుత్వ సంకల్పానికి, దేవుడి ఆశీస్సులు తోడైనట్టు… pic.twitter.com/JgDNSWhVTR
హైదరాబాద్ లో తొలి దశలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మరో కీలక ఘట్టం రాఖీ పర్వదినాన ప్రజలందరి సమక్షంలో ఘనంగా ప్రారంభమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలో దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలోనే, ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే, కోట్లాది రూపాయల విలువైన భూముల్లో ప్రజలు సగర్వంగా, సంతోషంగా నివసించేలా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని స్పష్టం చేశారు.

" పేదల సొంతింటి కల తీర్చాలనే ఈ ప్రభుత్వ సంకల్పానికి, దేవుడి ఆశీస్సులు తోడైనట్టు చిన్నోడు తీసిన లక్కీ డ్రాలో వారి కుటుంబానికే (జరపుల లక్ష్మీ) గారికి టోకెన్ రావడం మా అందరిని ఆనందానికి మరియు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం. చిన్నారులు స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో వారి కల నేరవేరుతున్నందున ఆ కుటుంబం సొంతింటిలో జీవితాంతం చల్లగా బ్రతకాలని ఆ ఆడబిడ్డను మనసారా ఆశీర్వదించడం జరిగింది" అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications