దెబ్బకు అమెరికాలో వణుకు, ట్రంప్ బిచ్చం అడుగుతున్నారు: ఉత్తర కొరియా

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యోంగ్‌యాంగ్: అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు యుద్ధాన్ని అడుక్కుంటున్నారని ఉత్తర కొరియా వ్యాఖ్యానించింది. శనివారం నాడు కొరియా విదేశాంగ మంత్రి మాట్లాడారు. ట్రంప్, ఆయన అడ్మినిస్ట్రేషన్ యుద్ధాన్ని బిచ్చమడుక్కుంటోందని విమర్శించారు.

ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ విపరీతంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ట్రంప్‌ను ఓ న్యూక్లియర్ భూతంగా, ప్రపంచ శాంతిని నాశనం చేసే వ్యక్తిగా ఆయన విమర్శించారు. అమెరికా - దక్షిణ కొరియాలు కలిసి మిలిటరీ డ్రిల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు.

 ఉత్తర కొరియా ఆనంద హేళ

ఉత్తర కొరియా ఆనంద హేళ

దాదాపు రెండు నెలల పాటు మౌనంగా ఉన్న ఉత్తర కొరియా ఇటీల మరో శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమవడంతో ఆ దేశం సంబరాల్లో మునిగితేలుతోంది. నృత్యాలు చేస్తూ బాణసంచా పేలుస్తూ ప్రజలు వేడుకలు చేసుకున్నట్లు ప్యాంగ్యాంగ్ అధికారిక మీడియా శనివారం వెల్లడించింది. ఆ దేశ అధికార పార్టీకి చెందిన పత్రికలోనూ ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రచురించారు.

అమెరికా వణికిపోయి ఉంటుంది

అమెరికా వణికిపోయి ఉంటుంది

ప్యాంగ్యాంగ్‌లోని కిమ్‌ ఈ సంగ్‌ స్క్వేర్‌ వద్ద జరిగిన సంబరాల్లో వేల సంఖ్యలో సైనికులు పాల్గొన్నారు. అధికార పార్టీ నిర్ణయాత్మక కమిటీ వైస్‌ ఛైర్మన్‌ పాక్‌ క్వాంగ్‌ హో నేతృత్వంలో ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా క్వాంగ్‌ హో అమెరికాపై దుమ్మెత్తి పోశారు. తమ దేశ అణుశక్తిని చూసి అమెరికా వణికిపోయి ఉంటుందన్నారు. ఇక ఎవరూ తమ దేశ హక్కులను అడ్డుకోబోరన్నారు.

వాషింగ్టన్ చేరే సామర్థ్యం

వాషింగ్టన్ చేరే సామర్థ్యం

ఉత్తర కొరియా బుధవారం హ్వాసంగ్‌ 15 ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణికి వాషింగ్టన్‌ చేరే సామర్థ్యం ఉందని పేర్కొంది. అయితే క్షిపణి ప్రయోగంతో ఆ ప్రాంతంలో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం వెల్లడించింది.

 ప్రకంపనలు వచ్చాయని ద కొరియా

ప్రకంపనలు వచ్చాయని ద కొరియా

పంగ్యే రి న్యూక్లియర్‌ సైట్‌కు 2.7 కి.మీ. దూరంలో 2.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు దక్షిణ కొరియా పేర్కొంది. అయితే శక్తిమంతమైన అణు పరీక్షలు జరిపినప్పుడు ఇలాంటి ప్రకంపనలు చోటుచేసుకుంటాయని భూవిజ్ఞాన అధికారులు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump and his administration are "begging for nuclear war," North Korea's Foreign Ministry said Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి