Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంతకు తెగించార్రా: స్వస్థత చేకూర్చే ఏసుక్రీస్తుగా !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాల్లో చిక్కుకున్నారు. కెథలిక్ చర్చి, వాటికన్‌ సిటీపై తన విమర్శలను తీవ్రతరం చేశారు. పోప్ లియోపై విరుచుకుపడ్డారు. అపర జీసస్ గా తనను తాను ప్రకటించుకున్నారు. జీసస్ తరహాలో హీలింగ్ చేస్తున్నట్లు ఓ ఫొటోను చిత్రీకరించారు. దీన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లాజరస్‌ను మరణం నుండి బ్రతికించిన ఏసుక్రీస్తు ఉదంతాన్ని పోలి ఉందీ ఫొటో.

జీసస్ ను తలపించేలా ఉన్నారు ట్రంప్ ఇందులో. పొడవైన వస్త్రాలు ధరించి, భుజాలపై ఎర్రటి కండువాతో కనిపించారు. ఆయన ఎడమ చేతిలో కాంతులీనుతున్న వస్తువును పట్టకున్నారు. కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగురేఖలు అందులో నుంచి ప్రసరిస్తోన్నాయి. నిశ్చలంగా పడుకుని ఉన్న లాజరస్ నుదుటిపై కుడిచేతిని పెట్టి ఆశీర్వచనం పలుకుతున్నట్లు డిజైన్ చేశారీ ఫొటోను. ట్రంప్ బ్యాక్ గ్రౌండ్ లో అమెరికా జాతీయ పతాకం, సైనిక విమానాలు, వైట్ హౌస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, దేవదూతల రూపాల్లో అమెరికన్ జవాన్లను పొందుపరిచారు. వేర్వేరు వర్గాలకు చెందిన ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్ ను జీసస్ గా కీర్తిస్తూ ఆయనకు ప్రార్థనలు చేస్తోన్నట్లు రూపొందించారు.

Trump Ramps Up Attack on Catholic Church and Posted Him Self as Jesus Image Sparks Firestorm Over Vatican

ఇది వివాదాలకు కేంద్రబిందువు అయింది. అనంతరం పోప్ లియోపై విమర్శలు చేశారు ట్రంప్. నేరాలపై బలహీన విధానాలను అనుసరిస్తోన్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాల వల్ల పోప్ పదవి ప్రభావితమైందని ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోయి ఉంటే పోప్ ఫ్రాన్సిస్ తర్వాత లియో ఈ బాధ్యతలు చేపట్టేవారు కాదని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఇరాన్ అణు ఆయుధాల విషయంలో మెతక వైఖరిని ప్రదర్శిస్తోన్నారని ధ్వజమెత్తారు.

తాను దేశ ప్రజల మద్దతు, భారీ మెజారిటీతో ఎన్నికయ్యానని, బలమైన శాంతిభద్రతలు, దూకుడు విదేశాంగ విధానాన్ని అనుసరిస్తానని తేల్చి చెప్పారు. తన పరిపాలనన సమర్థించుకున్నారు. పోప్ విదేశాంగ విధానం అత్యంత భయానకంగా ఉందని, తన అడ్మినిస్ట్రేషన్ పై భయపడుతున్నారని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. గతంలో చర్చి సేవలు నిర్వహించినందుకు ప్రీస్టులు, మత పెద్దలను అరెస్టు చేసినప్పుడు వాటికన్ ఎందుకు భయపడిందని ప్రశ్నించారు. కెథలిక్ చర్చి గానీ, ఇతర క్రైస్తవ సంస్థలకు అప్పుడు ఉన్న భయం గురించి పోప్ ఇప్పుడెందుకు ప్రస్తావించరని అన్నారు.

పోప్ లియో సోదరుడు లూయిస్ ను తాను అభిమానిస్తానని, ఆయన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ సపోర్టర్ అని ట్రంప్ తెలిపారు. లూయిస్ అన్ని విషయాలను బాగా అర్థం చేసుకోగలడని, ఆ సామర్థ్యం లియోకు లేదని అన్నారు. ఇరాన్‌కు అణు ఆయుధాలు ఉండటాన్ని సమర్థించే, వెనిజులాపై దాడి చేయడాన్ని తప్పుగా భావించే పోప్ తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు. లియో తనకు కృతజ్ఞుడై ఉండాలని, తాను వైట్‌హౌస్‌లో లేకపోతే, లియో వాటికన్‌లో ఉండేవాడు కాదని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+