వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాతో సీక్రెట్ హాట్ లైన్ కోసం.. ట్రంప్ అల్లుడి ఆరాటం, నిఘా సంస్థల కళ్లుగప్పి ఏం చేద్దామనో?

రష్యా ప్రభుత్వంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్‌నర్‌ మహా ఉబలాటపడిపోతున్నాడు. మొత్తానికి నిఘా సంస్థల కళ్లు గప్నే పనిలో మామా అల్లుళ్లు నిమగ్నమయ్యారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రష్యా ప్రభుత్వంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న తన ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ అల్లుడు, వైట్‌హౌస్‌ సీనియర్‌ సలహాదారు జారెడ్‌ కుష్‌నర్‌ డిసెంబర్‌లో అమెరికాలో రష్యా రాయబారితో మాట్లాడడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది.

నిజానికి అప్పటికి ట్రంప్‌ అధ్యక్ష పదవి కూడా స్వీకరించలేదు. అలా చూసుకుంటే ఆయన అల్లుడు కూడా అప్పుడు ఒక సాధారణ పౌరుడే. ఎలాంటి అధికార పదవి లేకుండా ట్రంప్‌ బృందం తరఫున రష్యా రాయబారి సెర్గీ కిసిలియాక్‌తో కుష్‌నర్‌ మాట్లాడటం ట్రంప్ ను పెద్ద ప్రమాదంలోనే పడవేసింది.

రహస్య సంబంధాలు మంచివే...

రహస్య సంబంధాలు మంచివే...

ఈ మేరకు రెండు అమెరికా ప్రధాన దినపత్రికలు వాషింగ్టన్‌ పోస్ట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనాలు ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న దర్యాప్తునకు మరింత పదును పెంచాయి. అయితే, తన అల్లుడిపై రాసిన వార్తలపై ట్రంప్‌ మండిపడటమే కాక, కుష్‌నర్‌ చాలా మంచోడని ప్రశంసించారు. తమతో మంచి సంబంధాలు లేని దేశంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మంచిదేనని అమెరికా హోంశాఖ మంత్రి జాన్‌ కెలీ వ్యాఖ్యానించారు.

నిఘా సంస్థల కళ్లుగప్పి ఏం చేయాలనో...

నిఘా సంస్థల కళ్లుగప్పి ఏం చేయాలనో...

దౌత్యపరమైన సౌకర్యం ద్వారా రష్యాకు లభించే సమాచార సంబంధాలను ట్రంప్‌ వాడుకుంటే రష్యన్లతో ఆయనేం మాట్లాడిందీ అమెరికా గూఢచార సంస్థలు తెలుసుకోలేవు. వైట్‌హౌస్‌లోని ముగ్గురు కీలకవ్యక్తులు అందించిన సమాచారంతో ఈ విషయం లీకైంది. కిందటి డిసెంబర్‌లో న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌లో రష్యా రాయబారితో జరిగిన సమావేశంలో కుష్‌నర్‌తో పాటు వివాదాస్పద మాజీ జనరల్‌ మైకేల్‌ ఫ్లిన్‌ కూడా ఉన్నారు.

దాచాలన్నా దాగవులే...

దాచాలన్నా దాగవులే...

ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక కొద్దికాలం ఫ్లిన్‌ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రహస్య కమ్యూనికేషన్‌ సౌకర్యం ఏర్పాటుకు ఎవరు ప్రతిపాదించారో తెలియదు. ట్రంప్‌ బృందం ఈ విషయాన్ని అప్పట్లో వెల్లడించలేదు. 5 నెలల తర్వాత ట్రంప్‌ బృందం-పుతిన్‌ సంబంధాలపై ఎఫ్‌బీఐ, కాంగ్రెస్‌ కమిటీల దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఈ విషయం మీడియాలో రావడంతో రష్యాతో కుష్‌నర్‌ సంబంధాలపై మరోసారి వివాదం చెలరేగింది.

ఆ బ్యాంకుతో పనేంటో?

ఆ బ్యాంకుతో పనేంటో?

రష్యా రాయబారితో సమావేశం తర్వాత.. అప్పటికే అమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాలోని ఓ బడా బ్యాంక్‌ వ్నెషేకానం బ్యాంక్ ‌(వీఈబీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సెర్గీ గోర్కోవ్‌తో కూడా ట్రంప్ అల్లుడు కుష్‌నర్‌ భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీకి, ట్రంప్‌ టవర్‌ మీటింగ్‌కూ సంబంధం ఉండొచ్చని రెండు పత్రికలూ సూచనప్రాయంగా తెలిపాయి.

మా అల్లుడు వెరీగుడ్...

మా అల్లుడు వెరీగుడ్...

బఈ బ్యాంక్‌ సహా ఇతర రష్యా ఆర్థిక సంస్థలపై విధించిన ఆంక్షలు తొలగిస్తే, అందుకు బదులుగా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్న కుష్‌నర్‌ న్యూయార్క్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ (666 ఫిఫ్త్‌ ఎవెన్యూ)కు వాటి నుంచి పెట్టుబడులు సంపాదించే విషయమై ఈ భేటీలో చర్చించి ఉండొచ్చని కూడా తెలుస్తోంది. ఈ కథనాల తర్వాత తన అల్లుడు సమర్ధుడు, మంచివాడని ట్విటర్‌లో ట్రంప్‌ ప్రశంసించినా, మరోపక్క కొంతకాలం ‘తగ్గి ఉండాలని' ఆయనకు సూచించారని వార్తలొచ్చాయి.

తప్పేం లేదు: వికీలీక్స్ అసాంజ్‌

తప్పేం లేదు: వికీలీక్స్ అసాంజ్‌

మరోవైపు రష్యాతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటుకు ట్రంప్ అల్లుడు కుష్‌నర్‌ చేసిన ప్రయత్నంలో తప్పేమీ లేదని వికీలీక్స్‌ స్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌ సమర్ధించారు. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పుడు డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఈ మెయిల్స్‌ను వికీలీక్స్‌ బయట పెట్టిన విషయం తెలిసిందే. రష్యా గూఢచార సంస్థల సహకారంతోనే అసాంజ్‌ ఈ పని చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. హిల్లరీ ఈ మెయిల్స్‌ వ్యవహారాన్ని ట్రంప్‌ తనకు అనుకూలంగా మార్చుకున్న విషయం తెలిసిందే.

English summary
U.S. President Donald Trump’s son-in-law and close adviser, Jared Kushner, had at least three previously undisclosed contacts with the Russian ambassador to the United States during and after the 2016 presidential campaign, seven current and former U.S. officials told Reuters. Those contacts included two phone calls between April and November last year, two of the sources said. By early this year, Kushner had become a focus of the FBI investigation into whether there was any collusion between the Trump campaign and the Kremlin, said two other sources - one current and one former law enforcement official. Kushner initially had come to the attention of FBI investigators last year as they began scrutinizing former national security adviser Michael Flynn’s connections with Russian officials, the two sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X