రష్యాను ఢీ కొట్టడానికి నేను రెడీ.. మీరు రెడీనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అన్ని విధాలుగా రష్యాను ఎదుర్కొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దీనికి నాటో సభ్య దేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆ దేశాలు తనకు సహకరిస్తే- రష్యా ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టడానికి వెనుకాడబోనని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ అన్నారు. ఇందుకు పూర్తి సహకారాన్ని నాటో అందించాల్సి ఉంటుందని మెలిక పెట్టారు.

ఈ మేరకు ట్రంప్.. నాటో సభ్య దేశాలన్నింటికీ ఓ బహిరంగ లేఖ రాశారు. సుదీర్ఘ లేఖ ఇది. అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు. ప్రత్యేకించి రష్యాపై నిప్పులు చెరిగారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, నాటో సభ్య దేశాల పాత్ర, చైనాపై అధిక టారిఫ్ ను విధించడం వంటి విషయాలను పొందుపరిచారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తోన్న రష్యా దూకుడుకు బ్రేకులు వేయాల్సిన అవసరం ఆయన అభిప్రాయపడ్డారు. నాటోలో చేరకుండా ఉక్రెయిన్ ను అడ్డుకుంటోన్న రష్యాను దెబ్బ తీయడానికి తాను ముందుంటానని పిలుపునిచ్చారు.

Trump Urges NATO to Cut Ties with Russian Oil Amid Ukraine Crisis

ఈ లేఖను తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. నాటో సభ్య దేశాలన్నీ కూడా మూకుమ్మడిగా తనకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తే.. రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలను విధిస్తానని తేల్చి చెప్పారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో- రష్యా నుండి క్రూడాయిల్ కొనుగోలును పూర్తిగా నిలిపివేయాలని ఆయన నాటో దేశాలకు డిమాండ్ చేశారు. కొన్ని దేశాలు రష్యా నుంచి క్రూడాయిల్ ను కొనుగోలు చేయడం ఆశ్చర్యకరమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇది రష్యాపై సంప్రదింపులు, బేరసారాల పరిస్థితిని బలహీనపర్చుతుందని డొనాల్డ్ ట్రంప్ విశ్లేషించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి నాటో దేశాలు ముందుకు రావాలని సూచించారు. చైనాపై 50 నుండి 100 శాతం టారిఫ్ ను విధించాలని ట్రంప్ ప్రతిపాదించారు. యుద్ధం ముగిసిన తర్వాత ఈ టారిఫ్ ను అవసరమైతే పూర్తిగా ఉపసంహరించుకోవచ్చని ఆయన సూచించారు. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ ఉందని, ఈ అధిక టారిఫ్ ల భారం దీన్ని బద్దలు కొట్టగలదని ట్రంప్ తేల్చి చెప్పారు.

Take a Poll

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తలెత్తడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, వొలొదిమిర్ జెలెన్ స్కీ కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండివుంటే ఈ యుద్ధం వచ్చేదే కాదని స్పష్టం చేశారు. తాను యుద్ధాన్ని ఆపడానికి, వేలాదిమంది రష్యన్- ఉక్రేనియన్ ప్రాణాలను కాపాడటానికి మాత్రమే అధ్యక్ష స్థానంలో ఉన్నానని వివరించారు. గత వారంలోనే 7,118 మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ లేఖలో తాను చేసిన సూచనలు, ప్రతిపాదనలను నాటో సభ్య దేశాలు అంగీకరిస్తే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగుస్తుందని ఆయన తెలిపారు. ఫలితంగా వేలాదిమంది ప్రాణాలను రక్షించవచ్చని చెప్పారు. లేకపోతే ఈ యుద్ధం అమెరికా సమయాన్ని, ఎనర్జీని, నిధులను వృథా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ పై రష్యా నిర్వహించిన వైమానిక దాడిని ఆయన గుర్తు చేశారు. దీని తర్వాత కూడా రష్యాపై అదనపు ఆంక్షల గురించి పదేపదే హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+