Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. నెల రోజులపైగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ త్వరగా ఒప్పందం చేసుకోవాలని, హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని కీలక హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న కారణంగా ఏప్రిల్ 2026 నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ అధికారిక ప్రకటన చేసింది. లీటర్ పెట్రోల్ పై 2 దినార్లు పెంచనున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఇంత భారీగా పెట్రోల్ ధరలు పెరగడం యూఏఈలో ఇదే తొలిసారి. తాజా రేట్లను యూఏఈ ఫ్యూయల్ ప్రైస్ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు మార్చి 31 న ప్రకటన విడుదల చేసింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగా అనేక దేశాల్లో ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే యూఏఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన ఇంధన ధరలు చూస్తే.. సూపర్ 98 పెట్రోల్ ప్రస్తుతం ధర లీటర్ 3.39 దినార్లకు పెరిగింది. మార్చిలో లీటర్ పెట్రోల్ ధర 2.48 దినార్లుగా ఉంది. అలాగే ఈ- ప్లస్ పెట్రోల్ ధర లీటర్ 3.20 దినార్లకు చేరింది. గత నెలలో చూస్తే లీటర్ పెట్రోల్ 2.40 దినార్లుగా ఉంది.

UAE Hikes Petrol and Diesel Prices from April 1 Amid Rising Global Oil Costs UAE fuel price hike

అలాగే డీజిల్ ధర లీటర్ ప్రస్తుతం 4.69 దినార్లుగా ఉంది. మార్చిలో ఈ ధర 2.72 దినార్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో యూఏఈ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో చమురు ధరలు 115- 120 డాలర్లు ఒక్కో బ్యారెల్ ఉంది. హార్మూజ్ జలసంధి మూసివేసిన నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. డీజిల్ ధరలు కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం యూఏఈలో పెరిగిన ఈ ధరలు ప్రపంచ మార్కెట్ తీరును అద్దం పడుతున్నాయి. ఇక యూఏఈలో పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+