ఇదేందయ్యోవ్.. అతను పుతిన్ బాడీ డబులా?- రంధ్రాన్వేషణ
Putin's body double: ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం.. అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్- వ్లాదిమిర్ పుతిన్ భేటీ. కొంతకాలంగా తరచూ వార్తల్లో ఉంటూ వచ్చింది. పదేళ్ల కాలంలో పుతిన్ అమెరికాకు రావడం ఇదే మొదటిసారి. 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి హాజరయ్యారు పుతిన్.
ఇప్పుడు మళ్లీ అలస్కాలో అడుగు పెట్టారు. ఈ పాయింటే.. ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. అలస్కాకు వచ్చింది నిజంగా పుతినేనా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమెరికా అన్నా, డొనాల్డ్ ట్రంప్ అన్నా పుతిన్ పెద్దగా ఇష్టపడడని, అలాంటిది ఏకంగా అలస్కా రావడం అనేది కొంత రంధ్రాన్వేషణకు దారి తీసింది.

ట్రంప్ తో సమావేశమైంది వ్లాదిమిర్ పుతిన్ కాదని, ఆయన బాడీ డబుల్ అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్లు- వారిద్దరి మధ్య జరిగిన చర్చల కంటే కూడా పుతిన్ బాడీ డబుల్ విషయంపైనే చర్చ జరుగుతోంది. హాట్ టాపిక్ గా మారింది.
దీనికి గల కారణాలను ఎవరికి వారు విశ్లేషించుకుంటోన్నారు. బుర్రలకు పదును పెట్టారు. తమ తమ వాదనలకు మరింత బలాన్నిచ్చేలా పుతిన్- ఆయన బాడీ డబుల్ మధ్య గల పోలికలను వెలికి తీస్తోన్నారు. ఈ పరిణామాలన్నింటిపై లండన్ కు చెందిన వెబ్ సైట్ డెయిలీ స్టార్ ఓ ప్రత్యేక కథనాన్ని ఎక్స్ క్లూజివ్ గా ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం- ట్రంప్‌ను కలిసింది అసలు వ్లాదిమిర్ పుతిన్ కాదని, ఆయన ట్రేడ్ మార్క్ అయిన 'గన్ స్లింగర్ వాక్' లేదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ను కలిసింది 'పుతిన్ బాడీ డబుల్' అని చాలా మంది నెటిజన్లు వాదిస్తోన్నారు. కొందరు అయితే చీపెస్ట్ బాడీ డబుల్ గా కూడా వ్యాఖ్యానిస్తోన్నారు.
అక్కడున్నది ఖచ్చితంగా బాడీ డబుల్. అసలు పుతిన్ బహుశా అలస్కాలోనే ఎక్కడో దాక్కుని ఉంటాడు.. అని ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పుతిన్ తన అయిదో బాడీ డబుల్ ను ఈ భేటీకి పంపించాడని తేల్చి చెప్పారు. అతను పుతిన్ లా లేడు. అతడి చెంపలు నునుపుగా ఉన్నాయి. నిజానికి పుతిన్ ముఖం అంత నునుపుగా ఉండదు. అతని కుడి చేయి కదలట్లేదు. ఇది క్లాసిక్ KGB వాక్..అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ బాడీ డబుల్‌ను వాదనలకు పేరు కూడా పెట్టారు నెటిజన్లు. 'జోవియల్ పుతిన్' వచ్చాడని, కావాలంటే హెయిర్ లైన్, చెంపలు, చిరునవ్వు, హావభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఓ యూజర్ చెప్పాడు. చెక్కిళ్లు చాలా లావుగా ఉన్నాయి. పుతిన్ కంటే ఎక్కువ చలాకీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, సమావేశాలకు పుతిన్.. తన బాడీ డబుల్‌ను పంపుతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉండటం కూడా తాజా అనుమానాలకు తెర తీసినట్టయింది. పుతిన్ గురించి గతంలో నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ న్యూరాలజీ ప్రొఫెసర్ బాస్టియాన్ బ్లోమ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తోన్నారు.
పుతిన్ తరచుగా తన కుడి చేతిని దృఢంగా ఉంచి, ఎడమ చేతిని స్వేచ్ఛగా అటూ ఇటూ ఊపుతూ నడుస్తారని, దీనికి గల కారణం- పార్కిన్సన్ లేదా స్ట్రోక్ వంటివి కారణం అయి ఉండొచ్చని గతంలో న్యూరాలజీ ప్రొఫెసర్ బాస్టియాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని ప్రస్తావిస్తూ బాడీ డబుల్ వాదనలకు కారణాలను చూపుతున్నారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications