షాకింగ్ ట్విస్ట్: ఇరాన్‌తో డీల్ సెట్ చేస్తున్న ట్రంప్.. వార్ ముగిసినట్టేనా?

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధ భయాలకు తెరపడిందనే సమాధానం వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అగ్ర నాయకత్వం నుంచి వస్తున్న తాజా ప్రకటనలు చర్చల దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

ట్రంప్ తాజా ప్రకటన
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. "ఇరాన్ మాతో మాట్లాడుతోంది. మేము ఏదైనా చేయగలమో లేదో వేచి చూడాలి. చర్చలు సాగుతున్నాయి కానీ ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం" అని పేర్కొన్నారు. ఓ వైపు తమ శక్తివంతమైన యుద్ధ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయని హెచ్చరిస్తూనే.. మరోవైపు దౌత్యపరమైన పరిష్కారానికి తలుపులు తెరిచి ఉంచారు.

US-Iran Conflict Update Donald Trump Confirms Negotiations War Fears Fade as Peace Talks Begin

ఇరాన్ స్పందన ఏమిటంటే?
ఇరాన్ కూడా యుద్ధం తమకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ మాట్లాడుతూ.. "మీడియాలో జరుగుతున్న ప్రచారం పక్కన పెడితే, చర్చలకు సంబంధించిన నిర్మాణాత్మక ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి" అని వెల్లడించారు. చర్చలకు తాము సిద్ధమేనని, అయితే అవి న్యాయంగా, గౌరవప్రదంగా ఉండాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చి పేర్కొన్నారు. తమ క్షిపణి వ్యవస్థ, రక్షణ సామర్థ్యాలపై మాత్రం ఎటువంటి చర్చలు ఉండవని ఇరాన్ స్పష్టం చేసింది.

వివాదానికి అసలు కారణం ఏంటి?
ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని, అణ్వాయుధాలు లేని కొత్త ఒప్పందంపై సంతకం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ఇరాన్‌లో నిరసనకారులపై జరిగిన అణచివేతను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దీనిపై స్పందించకపోతే సైనిక చర్య తప్పదని గతంలో హెచ్చరించారు. పశ్చిమాసియాలో అమెరికా తన యుద్ధ నౌకలను, విమానాలను భారీగా మోహరించడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

మరోవైపు యుద్ధం సంభవిస్తే అది ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు వెనక్కి తగ్గి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+