US Midterm Elections: ట్రంప్ కు ఎదురుగాలి- 5 స్వింగ్ రాష్ట్రాల్లో సీన్ రివర్స్-తాజా పోల్స్..!

అమెరికాలో రేపు జరిగే మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Elections) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా ఆయన ఆర్ధిక విధానాలు, ఇరాన్ యుద్దం వంటి అంశాల్లో అమెరికన్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావం మధ్యంతర ఎన్నికల్లో కనిపించేలా ఉంది. తాజాగా న్యూయార్క్ టైమ్స్-సీయానా కలిసి నిర్వహించిన ప్రీ-పోల్ లో ఐదు కీలక సెనేట్ రాష్ట్రాల్లో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లు ముందంజలో ఉన్నట్లు తేలింది.

భారత్ లెక్కల్ని మార్చబోతున్న అమెరికా ఎన్నికలు..! హెచ్ 1బీల నుంచి మెగా డీల్ వరకూ..!
భారత్ లెక్కల్ని మార్చబోతున్న అమెరికా ఎన్నికలు..! హెచ్ 1బీల నుంచి మెగా డీల్ వరకూ..!

అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలైన ప్రతినిధుల సభ, సెనేట్ కు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ప్రతీ రెండేళ్లకు సెనేట్ కు జరిగే ఎన్నికలతో పాటు ప్రతినిధుల సభకు జరిగే ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన ప్రతినిధుల సభలోని 435 సీట్లకు, సెనేట్ లోని 35 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ప్రస్తుతం రిపబ్లికన్ల చేతుల్లో ఉన్న ఆరు కీలక రాష్ట్రాల్లో ఐదింటిలో డెమోక్రాట్లు బాగా పుంజుకున్నట్లు న్యూయార్స్ టైమ్స్ అంచనా వేస్తోంది. అయోవాలో పోటీ దాదాపు సమంగా ఉందని, డెమోక్రాట్లు తమ సెనేట్ సీటును కాపాడుకుంటున్న ఏకైక రాష్ట్రమైన మిచిగాన్‌లో రెండంకెల ఆధిక్యాన్ని కనబరిచారని పోల్ తెలిపింది.

US Midterm Elections Democrats Lead in Five of Six Battleground Senate States NYT-Siena Poll Finds

ఎన్నికల రోజుకు ముందు టైమ్స్-సియానా నిర్వహించిన చివరి విడత సర్వేల ఆధారంగా వెలువడిన ఈ ఫలితాలు.. డెమోక్రాట్లకు ఒక చారిత్రాత్మక అవకాశం లభించబోతోందని సూచిస్తున్నాయి. సెనేట్‌లో మెజారిటీ సాధించాలంటే, ఆ పార్టీ తన ప్రస్తుత సీట్లను నిలబెట్టుకోవడంతో పాటు, రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న కనీసం నాలుగు సీట్లను కైవసం చేసుకోవాలి. తాజా పోల్ లో టెక్సాస్, కాన్సాస్‌లలో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ రాష్ట్రాలకు దీర్ఘకాలంగా రిపబ్లికన్ల ఓటింగ్ చరిత్ర ఉన్నప్పటికీ, అక్కడ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించగలిగారు.

US Midterm Elections Democrats Lead in Five of Six Battleground Senate States NYT-Siena Poll Finds
సీట్లోనే ట్రంప్ - అయినా అన్నీ బ్రేకులే ?- అమెరికా మధ్యంతర ఎన్నికల లెక్కేంటి?
సీట్లోనే ట్రంప్ - అయినా అన్నీ బ్రేకులే ?- అమెరికా మధ్యంతర ఎన్నికల లెక్కేంటి?

వీటిలో టెక్సాస్ డెమోక్రాట్ జేమ్స్ తలారికో, రిపబ్లికన్ కెన్ పాక్స్టన్‌పై 50% నుండి 43% ఆధిక్యంతో ముందున్నారు. కాన్సాస్ డెమోక్రాట్ ఆడమ్ హామిల్టన్, ప్రస్తుత రిపబ్లికన్ రోజర్ మార్షల్‌పై 49% నుండి 44% ఆధిక్యంతో విజయం సాధించారు. మెయిన్‌లో కూడా డెమోక్రాట్లు ఆధిక్యంలో ఉన్నారు, ఇక్కడ ట్రాయ్ జాక్సన్, రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్‌పై 51% నుండి 45% ఆధిక్యంతో ముందున్నారు. ఒహాయోలో మాజీ సెనేటర్ షెరాడ్ బ్రౌన్, ప్రస్తుత సెనేటర్ జాన్ హస్టెడ్‌పై 49% నుండి 44% ఆధిక్యంతో ముందున్నారు. అలాస్కాలో రిపబ్లికన్ సెనేటర్ డాన్ సుల్లివన్‌పై మేరీ పెల్టోలా 48% నుండి 46% ఆధిక్యాన్ని కలిగిఉన్నారు.
అయోవాలో డెమొక్రాట్ జోష్ టురెక్ రిపబ్లికన్ యాష్లీ హిన్సన్ కంటే 48% నుండి 47% ఓట్లతో స్వల్పంగా ముందంజలో ఉన్నారు. మిచిగాన్‌కు చెందిన అబ్దుల్ ఎల్-సయీద్ అత్యధిక ఆధిక్యాన్ని కనబరిచారు. రిపబ్లికన్ మైక్ రోజర్స్ 42%తో పోలిస్తే ఆయన 53%తో ముందంజలో ఉన్నారని పోల్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+