అక్రమ వలసలపై బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్

Elon Musk Interview with Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. మొన్నటికి మొన్న హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న తరువాత ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలను ముమ్మరం చేశారు. విస్తృతంగా పర్యటిస్తోన్నారు.

ఎన్నికల వేడి..

ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో పరాజయం పాలయ్యారు. మూడోసారి బరిలో దిగారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ఎదుర్కొంటోన్నారు.

US Presidential Elections 2024 Trump calls illegal migrants as radicals and terrorists

ఎక్స్‌తో ఇంటర్వ్యూ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా అపర కుబేరుడు టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది- మస్క్ అధికారిక హ్యాండిల్‌లో ప్రత్యక్ష ప్రసారమౌతోంది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్. అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

అనేక అంశాలపై..

పెన్సిల్వేనియా బట్లర్ ప్రాంతంలో జరిగిన ప్రాణాంతక దాడి, 2019 ఎన్నికల్లో ఓటమి, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య తలెత్తిన సంక్షోభ పరిస్థితులు, భారత్‌తో ఉన్న సంబంధాలు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన, అఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం, సిరియా.. వంటి అంశాలపై ట్రంప్ స్పందించారు.

వసలదారులపై..

అమెరికాకు అక్రమంగా వలస వెళ్లే వివిధ దేశాల పౌరులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. వారిని రాడికల్స్‌గా, టెర్రరిస్టులుగా అభివర్ణించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో వారి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలను నిష్ఫక్షపాతంగా జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు.

కమలా హ్యారిస్‌పై విమర్శలు

కమలా హ్యారిస్‌పై ట్రంప్ తన వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేశారు. ఇటీవలి కాలం వరకు ఆమె స్వదేశంలో భారతీయతను ప్రోత్సహించేలా వ్యవహరించారని, ఇప్పుడు నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తోన్నారంటూ ఆరోపించారు. భారతీయులన్నా, నల్ల జాతీయులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని, దాన్ని రాజకీయాల కోసం ఆమె వాడుకుంటున్నారని చెప్పారు.

తప్పించుకుంటోన్న కమల

కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా నామినేట్ అయినప్పటి నుంచి ఒక్క సుదీర్ఘ ఇంటర్వ్యూలో కూడా పాల్గొనలేదని, తనతో డిబేట్లకూ ముందుకు రావట్లేదని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. మీడియా నుంచి లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఆమె ఇలా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు.

అమెరికన్ల కలలు సాకారం..

అమెరికన్ల కలలను సాకారం చేస్తానని, వాటిని పునరుజ్జీవింపజేయడానికి తన వద్ద ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మరిన్ని భారీ కంపెనీలను స్థాపించాల్సిన అవసరం ఉందని స్ఫష్టం చేశారు. ప్రజలు కోరుకున్న ఉద్యోగాలకు స్వదేశంలోనే అందుబాటులోకి తీసుకుని రావాలనేది తన లక్ష్యమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+