గాజాపై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్- షాకింగ్ స్టేట్‌మెంట్

Donald Trump on Gaza: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- మరో సంచలనానికి తెర తీశారు. అక్రమ వసలదారులపై ఒకవైపు ఉక్కుపాదం మోపుతూనే అంతర్జాతీయ వివాదాలపై దృష్టి సారించారు. ఘర్షణలు, ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం, దాడులు- ప్రతిదాడులను నివారించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఆయా అంశాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తోన్నారు.

ఇజ్రాయెల్ దాడులతో అట్టుడికిపోతున్న గాజాపై తాజాగా సంచలన ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. గాజాను తాము స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. తమ సొంత ప్రాంతంగా భావిస్తామని అన్నారు. పాలస్తీనియన్లకు పునరావాసాన్ని కల్పించిన తరువాత గాజా తమ ఆధీనంలోకి వస్తుందని వెల్లడించారు.

US will take over and own Gaza after resettling Palestinians says Donald Trump

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఆయన సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ ముఖాముఖి భేటీ కొనసాగింది. పలు అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి మధ్య- తూర్పు, మధ్య ఆసియా రీజియన్‌లో నెలకొన్న ఉద్రిక్తత అంశం ప్రస్తావనకు వచ్చింది.

గాజా, లెబనాన్‌ను కేంద్రంగా చేసుకుని దాడులు, అశాంతియుత వాతావరణానికి కేంద్ర బిందువు అవుతున్నట్లుగా భావిస్తోన్న హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపుల దూకుడును అరికట్టడం, దానికోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ట్రంప్- నెతన్యాహు చర్చించారు. గత ఏడాది ఈ రెండు గ్రూపులపై సాగించిన దాడుల గురించి నెతన్యాహు ఆయనకు వివరించారు.

అనంతరం ట్రంప్, నెతన్యాహు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మధ్య- తూర్పు ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని నిర్మూలించడానికి తక్షణ చర్యలను తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ రీజియన్‌ను ది రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్గా పునర్నిస్తానని చెప్పారు.

ఈ క్రమంలో గాజాను తాము సొంతం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. దీనికంటే ముందు పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారికి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నివాస వసతిని కల్పిస్తానని అన్నారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌తో కలిసి పని చేస్తామని, ఇరాన్‌పై ఒత్తిడిని తీసుకొస్తామని వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య వివాదానికి చెల్లుచీటి పలకాల్సిన బాధ్యతను తాను తీసుకుంటానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో గాజాకు అమెరికా సాయుధ బలగాలను పంపించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అక్కడి ప్రజలకు భద్రత కల్పించడానికి తమ దేశ సైన్యాన్ని వినియోగించాలని యోచిస్తోన్నట్లు చెప్పారు. గాజాకు ఏది అవసరమో అవన్నీ సమకూరుస్తానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+