కరోనా : ప్రపంచం ఊపిరి పీల్చుకునే విషయం.. ఈ మౌత్ వాష్‌తో వైరస్‌కు చెక్..

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన సైంటిస్టులు నిరంతర ప్రయోగాల్లో తలమునకలయ్యారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైతే భౌతిక దూరం,స్వీయ నియంత్రణ తప్ప కరోనాను నియంత్రించేందుకు మరో మార్గం లేదు. అయితే కరోనాను నియంత్రించేందుకు ఓ మౌత్ వాష్ అందుబాటులో ఉందని కొరియా మెడికల్ సైన్స్ జర్నల్‌లో తాజాగా ఓ ఆసక్తికర కథనం ప్రచురించబడింది.

Recommended Video

    Chlorhexidine Mouthwash Could Protect Against COVID-19
    ఏంటా మౌత్ వాష్... దాని వల్ల ఉపయోగమేంటి..

    ఏంటా మౌత్ వాష్... దాని వల్ల ఉపయోగమేంటి..

    ఆ జర్నల్‌లో పేర్కొన్న అధ్యయన వివరాల ప్రకారం.. క్లోర్‌హెక్సిడైన్ అనే మౌత్ వాష్‌ను ఉపయోగించడం ద్వారా నోటిలోని లాలాజలంలో ఉండే వైరల్ లోడ్‌ రెండు గంటల పాటు తగ్గుముఖం పట్టింది. కానీ మౌత్ వాష్ ఉపయోగించిన రెండు నుంచి నాలుగు గంటల తర్వాత ఆ వైరస్ లోడ్ మళ్లీ పెరిగింది. అయితే ఈ మౌత్ వాష్‌ను ఉపయోగించడం ద్వారా SARS-CoV-2 వ్యాప్తిని నియంత్రించవచ్చునని జర్నల్‌లో పేర్కొన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆసుపత్రుల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు దీన్ని ఉపయోగించడం ద్వారా ఫలితాలు ఉంటాయన్నారు.

    10మి.లీ మౌత్ వాష్‌తో 2 గంటలు..

    10మి.లీ మౌత్ వాష్‌తో 2 గంటలు..

    సాధారణంగా నోటిలోని లాలాజలంలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి ఇతరులతో మాట్లాడే సందర్భాల్లో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని జర్నల్‌లో పేర్కొన్నారు. కాబట్టి 10మి.లీ క్లోర్‌హెక్సిడైన్ మౌత్ వాష్‌ను 30 సెకన్ల పాటు వాడటం ద్వారా రెండు గంటల పాటు లాలాజలంలో వైరస్ లోడ్‌ను తగ్గించవచ్చన్నారు. తద్వారా కోవిడ్ 10 ట్రాన్స్‌మిషన్‌ను నియంత్రించవచ్చునని స్పష్టం చేశారు. డెర్మటాలజీ,ఈఎన్‌టీ,ఆప్తమాలజీ,జనరల్ ప్రాక్టీస్,డెంటల్ క్లినిక్స్‌లోకి పేషెంట్లను అనుమతించే ముందు ఈ మౌత్ వాష్‌తో నోటిని శుభ్రపరుచుకోవాలని చెప్తే.. వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ముఖ్యంగా డెంటిస్టులకు లాలాజలం ద్వారా వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి.. తరుచూ ఈ మౌత్ వాష్‌ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుందన్నారు.

    ఇలా చేస్తే నియంత్రణ సాధ్యమే..!!

    ఇలా చేస్తే నియంత్రణ సాధ్యమే..!!

    కంటైన్‌మెంట్ జోన్లు,రెడ్ జోన్ల నుంచి వచ్చేవారిని,అలాగే హోం క్వారెంటైన్‌లో ఉన్నవారిని ప్రతీ 2 గంటలకు ఒకసారి CHX మౌత్ వాష్ ఉపయోగించమని చెబితే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునన్నారు. అలాగే రోజువారీ పనుల కోసం ఇంటి నుంచి బయటకెళ్లేవారు.. ఈ మౌత్ వాష్‌ను వాడటం వల్ల కరోనా బారినపడకుండా ఉండగలరని పేర్కొన్నారు.జర్నల్‌లో ప్రచురించిన అంశాలు బాగానే ఉన్నప్పటకీ.. ఈ మౌత్ వాష్ ఇంకా ఏయే టెస్టులను ఎదుర్కోవాల్సి ఉంటుందో చెప్పలేం. కరోనా నియంత్రణకు తాత్కాలిక విరుగుడుగా దీన్ని వాడేందుకు డబ్ల్యూహెచ్ఓ ఏమంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఓరల్ హెల్త్‌కేర్ విభాగంలో 35కి పైగా దేశాలలో విస్తరించిన ప్రముఖ భారతీయ తయారీదారులలో ఒకరైన ఐసీపీఏ హెల్త్ ప్రొడక్ట్స్ ఈ మౌత్ వాష్‌లను తయారుచేస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+