కొడుక్కి సీటు ఇవ్వలేదని హార్వర్డ్ పై పగబట్టిన ట్రంప్..? అసలు విషయం ఇదేనా..!
ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని కోర్టు స్టే విధించింది. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.
అయితే ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ఎందుకు కోపం వ్యక్తం చేశారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ట్రంప్.. తన చిన్న కుమారుడికి అడ్మిషన్ ఇవ్వలేదన్న కోపంతోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై చర్యలకు పాల్పడినట్లు కథనాలు వస్తున్నాయి.
ట్రంప్ చిన్న కుమారుడు బారన్ కు హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు ఇవ్వని కారణంగానే ట్రంప్.. ఆ విశ్వవిద్యాలయంపై కఠినమైన చర్యలకు పాల్పడినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే బారన్ కు హార్వర్డ్ తోపాటు ఇతర ప్రముఖ యూనివర్సిటీలు అయిన కొలంబియా, స్టాన్ ఫోర్డ్ సైతం అడ్మిషన్ నిరాకరించాయట. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే ఈ వివాదంపై ట్రంప్ సతీమణి, దేశ ప్రథమ మహిళ మెలానియా కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అసలు బారన్.. హార్వర్డ్ యూనివర్సిటీకు అప్లై చేసుకోలేదని స్పష్టం చేశారు మెలానియా కార్యాలయం అధికారులు. అతని తరఫున కూడా ఎవరూ దరఖాస్తు చేయలేదని పేర్కొన్నారు.

ఇక 2024 అమెరికాలోని ఎంబసీ లెక్కల ప్రకారం అగ్రరాజ్యంలో 3 లక్షల 50 వేలమందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లినట్లు సమాచారం అందుతోంది. అయితే గతేడాది కంటే 23 శాతం పెరిగినట్లు సమాచారం. మరోవైపు విదేశీ విద్యార్థులకు అందించే ఎఫ్-1 వీసాలను కేవలం 20 సెకన్లలోనే తిరస్కరణకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రకరకాల ఆంక్షల కారణంగా విదేశీ విద్యార్థుల వీసాలు రిజెక్ట్ అవుతున్నట్లు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications