తొలిసారి అద్భుతం: చిన్నారికి రెండు చేతులు మార్పిడి
వాషింగ్టన్: అమెరికాలో తొలిసారి, ఓ చిన్న పిల్లవాడికి రెండు చేతులు ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా అమర్చి సర్జన్లు విజయం సాధించారు. జియోన్ హార్వే అనే పిల్లాడికి దాత ఇచ్చిన రెండు చేతులను చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు అమర్చారు.
బాలుడు ఎనిమిదేళ్ల వాడు. అతనికి రెండు చేతులను మార్పిడి ప్రక్రియ ద్వారా అమర్చారు. ఈ శస్త్ర చికిత్స కోసం వైద్యులు పది గంటల పాటు శ్రమించారు. దానిని విజయవంతంగా పూర్తి చేశారు.

జియాన్ హార్వేకి కొన్నేళ్ల క్రితమే తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా రెండు చేతులు, పాదాన్ని తొలగించారు. మూత్రపిండాల మార్పిడి కూడా జరిగింది. జూలై నెలలోనే చిన్నారికి దాత నుంచి సేకరించిన చేతులు, భుజాల్ని అమర్చారు.
40 మందితో కూడిన వైద్యులు, నర్సులు, సిబ్బంది బృందం శ్రమ ఫలించింది. ఏళ్లకొద్దీ శిక్షణ, నెలల కొద్దీ ప్రణాళిక, ఓ బృందం కసరత్తు ఫలితమే ఈ శస్త్రచికిత్స అని ఫిలడెల్ఫియాలోని శిశు వైద్యశాలకు చెందిన స్కాట్ లెవిన్ పేర్కొన్నారు. బాలుడు త్వరగానే పూర్తిస్థాయిలో కోలుకుంటాడని చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications