రష్యా దెబ్బతిన్నది ఇక్కడే-పద్మవ్యూహంలో చిక్కి విలవిల-ఓటమి తప్పకపోతే అణ్వస్త్రం?
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుగానే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. చిన్న దేశం ఉక్రెయిన్ పై రష్యా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తుందని అంతా భయపడ్డారు. రష్యా కూడా ఉక్రెయిన్ ను సులువుగా చేజిక్క్ంచుకోవచ్చని భావించింది. అయితే యుద్ధం మొదలై మూడువారాలు దాటిపోయినా ఇంకా ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్ధితి. ముఖ్యంగా రష్యాకు తలుగుతున్న ఎదురుదెబ్బల్ని చూసి ప్రపంచదేశాలు సంబరపడుతున్నాయి. అయితే రష్యాకు ఎందుకీ దుస్దితి ఎదురైందన్న అంశం మాత్రం అందరినీ ఆలోచింప చేస్తోంది.

ఉక్రెయిన్ ను తక్కువ అంచనా వేసిన రష్యా
ఉక్రెయిన్ పై యుద్ధానికి కాలుదువ్విన రష్యా.. ప్రపంచ దేశాల హెచ్చరికల్ని సైతం లెక్కచేయకుండా యుద్ధంలోకి దూకేసింది. తమతో పోలిస్తే అంగబలం, అర్ధబలంలో సగం కూడా లేని ఉక్రెయిన్ ను సులువుగా చేజిక్కించుకోవచ్చని భావించింది. ప్రపంచదేశాల్ని మాత్రం జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. దీంతో ఉక్రెయిన్ ను రష్యా చాలా సులువుగా దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ జరుగుతోంది వేరు. దీంతో ప్రపంచదేశాలు నివ్వెరపోతున్నాయి.

పద్మవ్యూహంలో చిక్కి విలవిల
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చేజిక్కించుకునేందుకు ఏకంగా 65 కిలోమీటర్ల పొడవైన భారీ కాన్వాయ్ తో బయలుదేరిన రష్యా .. అత్యంత తక్కువ సమయంలోనే విజయంసాధిస్తామని అంచనా వేసుకుంది. కానీ కీవ్ కు చేరుకునేందుకు బయలుదేరిన రష్యా కాన్వాయ్ సరిహద్దుల్లోకి చేరుకునే వరకూ వేచి చూసిన ఉక్రెయిన్ సేనలు.. ఆ తర్వాత దాన్ని గెరిల్లా మార్గాల్లో టార్గెట్ చేశాయి. మరోవైపు రష్యా కాన్వాయ్ కు ఆహారంతో పాటు ఇతర సాయం అందించేందుకు వాయుమార్గంలో వీలు కాలేదు. దీంతో రోడ్డు మార్గంలోనే వీరికి ఆహారం, సామాగ్రి అందించాల్సిన పరిస్ధితి పుతిన్ కు ఎదురైంది. కానీ గెరిల్లా మార్గంలో ఉక్రెయిన్ చేస్తున్న ఎదురుదాడితో అదీ సాధ్యం కాలేదు. దీంతో పద్మవ్యూహంలో చిక్కి విలవిల్లాడుతోంది.

14 వేల రష్యా సైనికుల మృతి?
ఉక్రెయిన్ పై పోరు కోసం రష్యా లక్షా 90 వేల మంది సైన్యాన్ని అక్కడికి పంపింది. అయితే తొలుత ఉక్రెయిన్ లోకి ప్రవేశించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో వీరంకా చురుగ్గా ముందుకు కదిలారు. కానీ ఆ తర్వాత ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ సైన్యంతో పాటు పౌరులు కూడా ఆయుధాలతో గెరిల్లా దాడులకు దిగడంతో రష్యా ఏకంగా 14 వేల మంది సైనికుల్ని కోల్పోయింది. ఇంత భారీ స్ధాయిలో సైనికుల్ని కోల్పోవడం సహజంగానే రష్యా సైన్యం నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు ఉక్రెయిన్ లో ఉన్న వారిలో ఇంకా ఎంతమందిని పోగొట్టుకోవాల్సి వస్తుందో తెలియదు. దీంతో రష్యా సైన్యంలోనే యుద్ధంపై వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయుధ సంపత్తిలోనూ రష్యా డొల్లతనం
ఉక్రెయిన్ పై పోరులో రష్యా తన దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధ వ్యవస్ధల్ని వాడుతుందని అంతా భావించారు. ముఖ్యంగా తీ14 యుద్ధ ట్యాంకుల్ని ఉక్రెయిన్ లో వాడుతుందని భావించినా రష్యా మాత్రం తమ దగ్గరున్న పాత టీ 72 ట్యాంకుల్నే వాడుతుండడం పరిశీలకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. అలాగే సంప్రదాయ సైనిక వాహనాలు, శతఘ్నులు, రాకెట్ లాంచర్లనే వాడుతోంది. ఇవి ఉక్రెయిన్ దగ్గరున్న ఎయిర్, మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధల్ని తట్టుకుని ముందుకుసాగలేకపోతున్నాయి. దీంతో ఆయుధ సంపత్తిలోనూ రష్యా డొల్లతనం బయటపడింది.

వైఫల్యాలు కొనసాగితే అణు ప్రయోగం?
ఇప్పటికే ఉక్రెయిన్ తో రష్యా పోరు ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. మరింతకాలం యుద్ధం చేసేంత స్ధాయిలో ఆయుద్ధ సంపత్తి కానీ, సైనికులు కానీ రష్యా వద్ద లేరనే వాస్తవం అందరికీ అర్ధమైపోతోంది.దీంతో అంతర్జాతీయంగా కూడా రష్యా పరువుపోతోంది. ఇప్పుడు చర్చల పేరుతో యుద్ధాన్ని విరమించడం ఒక్కటే పుతిన్ కు మిగిలుంది.
అయితే ఇందుకు ఆయన ఇగో ఒప్పుకోవడం లేదు. దీంతో యుద్ధం నుంచి వెనక్కి తగ్గేందుకు పుతిన్ సిద్ధపడటం లేదు. కానీ ప్రస్తుత వైఫల్యాలు మరికొంతకాలం కొనసాగితే మాత్రం ఉక్రెయిన్ పై అణుప్రయోగానికి సైతం పుతిన్ సిద్ధపడతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అప్పుడు పశ్చిమదేశాలు ఎలా రియాక్ట్ అవుతాయన్న దానిపైనే భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉంటాయనే విశ్లేషణలు వస్తున్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications