ఆ హత్యకు ట్రంప్‌కు సంబంధం లేదు: వైట్‌హౌజ్ సమాధానం ఇది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వలస విధానాలకు.. రెండ్రోజుల క్రితం జరిగిన తెలుగు ఇంజినీరు శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు ఎలాంటి సంబంధం లేదని శ్వేతసౌధం తెలిపింది.

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వలస విధానాలకు.. రెండ్రోజుల క్రితం జరిగిన తెలుగు ఇంజినీరు శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు ఎలాంటి సంబంధం లేదని శ్వేతసౌధం తెలిపింది. ట్రంప్‌ విధానాల కారణంగా హింస చెలరేగిందనడం అసంబద్ధమని శ్వేతసౌధం ప్రతినిధి సియాన్‌ స్పైసర్‌ పేర్కొన్నారు.

'ఎవరివైనా ప్రాణాలు కోల్పోవడం విషాదకరమే.. కానీ సంఘటనకు వేరేవాటితో సంబధం అంటగట్టడం అసంబద్ధం' అని సియాన్ పేర్కొన్నారు. అమెరికా నావికాదళ మాజీ సభ్యుడైన పూరింటన్ అనే వ్యక్తి.. భారతీయ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కుచిభోట్ల, మాదసాని అలోక్‌ రెడ్డి, వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌పై పూరింటన్ కాల్పులు జరిపాడు.

White House reacts to killing of Srinivas Kuchibhotla

ఈ సందర్భంగా పూరింటన్ 'మా దేశం నుంచి వెళ్లిపోండి.. ఉగ్రవాదుల్లారా..' అంటూ నినాదాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు. దీనిని ఉదహరిస్తూ ట్రంప్.. ఇటీవల రెచ్చగొట్టిన జాతి విద్వేషాల కారణంగానే చోటుచేసుకుందని ప్రశ్నించినప్పుడు స్పైసర్‌ పై విధంగా స్పందించారు.

White House reacts to killing of Srinivas Kuchibhotla

కాగా, ఈ ఘటనపై భారతీయ రాయబార కార్యాలయం స్పందించింది. దీనిపై త్వరతగతిన విచారణ నిర్వహించాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విచారణకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారతీయ రాయబార కార్యాలయానికి అందజేయాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+