వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron virus:డేంజర్ ఒమిక్రాన్.. బీ అలర్ట్ డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్.. ఒమిక్రాన్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఎందుకంటే ఈ కొత్త వేరియంట్ డేంజర్ అని చెప్పడంతో అంతా భయాందోళనకు గురవుతున్నారు. క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆగ్నేయాసియా దేశాల‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్ట‌ర్ పూనం ఖేత్ర‌పాల్ సింగ్ సూచించారు. ఇది డెల్టా వేరియంట్ కంటే ప్ర‌మాద‌క‌రం అని పేర్కొన్నారు.

ద‌క్షిణాఫ్రికాతోపాటు ప‌లు దేశాల్లో వేరియంట్ విరుచుకు పడుతుంది. నిత్యం నిఘా పెంచాల‌ని, ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ‌ల్ని బ‌లోపేతం చేయాల‌ని ఖేత్ర‌పాల్ సింగ్ చెప్పారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంతం చేయ‌డంతోపాటు.. వ్యాపించ‌కుండా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌కు లోబ‌డే పండుగ‌లు,ఇత‌ర వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని, భౌతిక దూరం పాటించ‌డంతోపాటు జ‌న స‌మూహాల‌కు దూరంగా ఉండాల‌ని ఆమె సూచించారు. ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించే విష‌యంలో అల‌స‌త్వం ప‌నికి రాద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆగ్నేయాసియా దేశాల్లో క‌రోనా కేసులు త‌గ్గుతున్నా.. ప‌లు దేశాల్లో మ‌హ‌మ్మారి విజృంభించ‌డం, పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్లు ముప్పును గుర్తు చేస్తున్నాయ‌ని ఖేత్ర‌పాల్‌సింగ్ చెప్పారు. ఈ వేరియంట్ నుంచి ర‌క్ష‌ణ కోసం, దాని వ్యాప్తి నివార‌ణ‌కు నిఘా పెంచాల‌ని సూచించారు. అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల ద్వారా, కొత్త వేరియంట్ల వ్యాప్తిపై వ‌స్తున్న వార్త‌ల స‌మాచారంతో త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ముక్కూ నోటిని క‌ప్పివేసేలా మాస్క్‌లు ధ‌రించి, భౌతిక దూరం పాటించాల‌ని పేర్కొన్నారు.

 who urges south asian countries to up their guard

తరచు చేతులు శుభ్ర‌ప‌రుచుకుంటూ.. వెలుతురు లేని గ‌దుల‌కు దూరంగా ఉండాల‌ని ఖేత్ర‌పాల్ సింగ్ వివ‌రించారు. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ వేయించుకోవాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆగ్నేయాసియా ప్రాంత జ‌నాభాలో 31 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోగా, 21 శాతం మందికి పాక్షికంగా టీకా అందింద‌న్నారు. మ‌రో 48 శాతం ఇంకా టీకాలు వేయించుకోలేద‌న్నారు. అటువంటి వారికి వైర‌స్ ముప్పు పొంచి ఉంద‌ని హెచ్చ‌రించారు.

కొత్త వేరియంట్‌ను ఒమ్రికాన్ అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు. అయితే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించాల్సి ఉంటుంది.

English summary
who urges south asian countries to up their guard due to omicron covid-19 variant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X