Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Most Liveable Cities 2023 : టాప్ 10లో 3 కెనడా నగరాలు-అడుగున 5 భారత్ నగరాలు..

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ఇవాళ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితా విడుదల చేసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, స్థిరత్వం, మౌలిక సదుపాయాలు, పర్యావరణంతో సహా అనేక కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రతీ ఏటా ప్రకటించే గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ లో భాగంగా ఈ నగరాల పేర్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల పేర్లున్న ఈ జాబితాలో భారత్ కు మాత్రం నిరాశ తప్పలేదు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్ధానంలో నిలిచింది. వియన్నా తర్వాత, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ తన రెండో స్ధానాన్ని మరోసారి నిలుపుకుంది. ఆస్ట్రేలియా నగరాలు మెల్‌బోర్న్ , సిడ్నీ ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. కెనడాలోని ఏకంగా మూడు నగరాలు ఈ జాబితాలో టాప్ 10లో నిలిచాయి. వీటిలో కాల్గరీ, వాంకోవర్, టొరంటో ఉన్నాయి. స్విస్ నగరాలు జ్యూరిచ్ ఆరవ స్థానంలో, జెనీవా కాల్గరీతో ఏడవ స్థానంలో నిలిచింది. అలాగే జపాన్‌లోని ఒసాకా 10వ స్థానంలో నిలిచింది.

worlds most liveable cities 2023 : 3 canadian cities in top 10, five indian cities in bottom

ఈ జాబితాలో భారత్ లోని ఐదు నగరాలకు చోటు దక్కింది. అయితే 173 నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై అత్యంత పేలవ ర్యాంకులు సాధించాయి. న్యూఢిల్లీ, ముంబై 141వ స్థానంలో , చెన్నై 144వ స్థానంలో ఉన్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు వరుసగా 147, 148 స్థానాల్లో నిలిచాయి.

యూకే రాజధాని లండన్, స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ వరుసగా 12, 22 స్థానాలు దిగజారి 46వ, 43వ స్థానాల్లో నిలిచాయి. డమాస్కస్ ఒక దశాబ్దానికి పైగా ఇండెక్స్‌లో అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోంది. యుద్ధం నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం కూడా అట్టడుగు స్ధానంలో నిలిచింది.

ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై గణనీయంగా తగ్గిన భారంతో పాటు పిల్లలు పాఠశాలలకు తిరిగి రావడంతో ఈ నగరాల్లో ప్రామాణికంగా విద్య బలంగా మారింది. ఆసియా, మధ్యప్రాచ్యంలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలోని నగరాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మెరుగుపడినట్లు ఈ నివేదిక పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+