Worm Moon: కనువిందు చేస్తోన్న హోలీ పున్నమి చంద్రుడు- వానపాములతో సంబంధం..!!
హోలీ పున్నమి చంద్రుడు కనువిందు చేస్తోన్నాడు. ఈ ఏడాది శీతాకాలపు చివరి పున్నమి ఇదే. దీన్ని వార్మ్ మూన్ గా పిలుస్తారు.
వాషింగ్టన్: దేశ ప్రజలు ఇవ్వాళ హోలీ పండగను సంతోషంగా జరుపుకొన్నారు. హోలికా పౌర్ణమి నాడు కామదహనంతో ఈ వేడుకలు ఆరంభం అయ్యాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయంలో ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఒకే రోజున ఈ పండగ వేడుకల్లో పాల్గొనకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హోలికా పౌర్ణమిగా..
ఈ పండగలో అతి ప్రధానమైనది కామదహన కార్యక్రమం. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో సోమవారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవ్వాళ రంగులు చల్లుకుంటూ వైభవంగా ఈ పండగను నిర్వహించారు. క్యాలెండర్ ప్రకారం- ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజును హోలీకా పౌర్ణమిగా భావిస్తారు.

వార్మ్ మూన్ గా..
ఇంగ్లీష్ సంప్రదాయంలో- మార్చిలో కనిపించే మొదటి పున్నమి చంద్రుడిని దీన్ని వార్మ్ మూన్ (Worm Moon)గా పిలుస్తారు. ఈ సంవత్సరం శీతాకాలపు చిట్ట చివరి పౌర్ణమి కూడా ఇదే. ఇక వచ్చే రోజులన్నీ వేసవితో కూడుకుని ఉండటం వల్ల ఈ చలికాలం సీజన్ లో చివరి పున్నమిగా భావిస్తారు. సాయంత్రం 6:30 నిమిషాలకు చంద్రోదయమైంది. అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తోంది చందమామ.
వానపాముల ఆవిర్భావం..
ఉత్తర అమెరికాలో వానపాముల ఆవిర్భావానికి ఇవ్వాళే బీజం పడుతుంది. అమెరికాలో చలికాలంలో విపరీతంగా మంచుకురుస్తుంటుంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదని అమెరికన్లు విశ్వసిస్తారు. ఎండాకాలం ఆరంభమౌతుందనడానికి వార్మ్ మూన్ ను సంకేతంగా భావిస్తారు. వార్మ్ మూన్ తరువాతి రోజు నుంచే నేల వేడెక్కడం ప్రారంభమౌతుందని, ఆ సమయంలో వానపాములు పుట్టుకొస్తాయని నమ్ముతారు.

సాస్ మూన్..
వార్మ్ మూన్ తరువాత ఉష్ణోగ్రత పెరుగుతుందని, గడ్డకట్టిన చెట్టు బెరడు నుంచి రైతులకు ప్రయోజనం కల్పించే బీటిల్ లార్వా ఆవిర్భవిస్తుందని భావిస్తారు. వానపాములు.. రైతులకు ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. మార్చిలో వచ్చే పౌర్ణమిని సాప్ మూన్ అని కూడా పిలుస్తారు.

ఎన్నో పేర్లు..
క్రో మూన్ గానూ భావిస్తారు. ఇది శీతాకాలం ముగియబోతోందనడానికి సంకేతంగా క్రో మూన్ అని పిలుస్తారు అమెరికన్లు. యూరప్ దేశాల్లో లెంటెన్ మూన్ గా భావిస్తారు. వివిధ దేశాల్లో ఈగిల్ మూన్, గ్రూస్ మూన్.. ఇలా వేర్వేరు పేర్లతో పిలుస్తారు. భారత్ లో హోలీ పున్నమిగా జరుపుకొంటారు.

మూన్ సైకిల్..
చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ఈ పండుగను హిందువులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వార్మ్ మూన్ తరువాత చంద్రుడి క్షీణదశ ఆరంభమౌతుంది. అమావాస్య నాటికి అంటే ఈ నెల 21వ తేదీ నాటికి 29.5-రోజుల మూన్ సైకిల్ ముగుస్తుంది.












Click it and Unblock the Notifications