'ఊపు ఉంది ఊపేద్దాం'.. ట్రంప్ కు జిన్ పింగ్ ఫోన్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ లో సంభాషణ జరిపారు. ఈ విషయాన్ని చైనాకు చెందిన గ్జిన్ హువా న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం కూడా ధ్రువీకరించింది. ఇరు దేశాధినేతల మధ్య సోమవారం ఈ సంభాషణ జరిగినట్లు ఇరు దేశాలు తెలిపాయి. ఈ ఫోన్ సంభాషణలో ముఖ్యంగా తైవాన్, ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం తదితర అంతర్జాతీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పేర్కొన్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పాజిటివ్ గా సాగుతున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా- చైనా ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తైవాన్ విషయంలో చైనా వైఖరి ఏంటన్నది ట్రంప్ కు జిన్ పింగ్ వివరించారు. వరల్డ్ వార్ 2 తర్వాత చైనా పరిధిలోకి తైవాన్ రావడం చారిత్రకంగా ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. అలాగే మూడేళ్లకుపైగా సాగుతున్న ఉక్రెయిన్- రష్యా యుద్ధంపైనా ఇరు దేశాల అధినేతలు చర్చించారు.

Xi to Trump Expand Good Relations Key Takeaways from Their Latest Phone Call

ఇక గత నెలలో దక్షిణకొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశం అయిన విషయం తెలిసిందే. గతనెలలోనే ఇరు దేశాల మధ్య టారిఫ్ ఆంక్షలు రద్దయ్యాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలను తగ్గించింది. అలాగే చైనా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రేర్ ఎర్త్ మినరల్స్ పై ఆంక్షలను రద్దు చేసింది. ఇదే విషయంపై ఫోన్ కాల్ అనతరం జిన్ పింగ్ మాట్లాడుతూ.. అక్టోబర్ లో దక్షిణకొరియాలో ట్రంప్ తో సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఊపందుకున్నట్లు పేర్కొన్నారు. ఇక తైవాన్.. తమ భూభాగం పరిధిలోనిదేనని చైనా వాదిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తైవాన్ పరిధి దాటితే.. సైన్యం సాయంతో తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని బెదిరింపులకు పాల్పడుతోంది.

ఇక జెనీవా వేదికగా ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై జరుగుతున్న శాంతి చర్చల్లో ఇరు దేశాల కీలక పురోగతి కనిపించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. ఇక రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నిలిపివేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ కు నవంబర్ 27 లోపు డెడ్ లైన్ పెట్టారు డొనాల్డ్ ట్రంప్. ఈ లోపు శాంతి ప్రణాళికకు అంగీకరించాలని అన్నారు. అయితే ఉక్రెయిన్ మాత్రం శాంతి ప్రణాళికకు కొన్ని సవరణలు చేయాలని పట్టుబడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+