ఐపీఎల్‌లో కడప క్రికెటర్ ఎంట్రీ: ధోనీ సేనలో చేరిన మారంరెడ్డి: చెన్నై సూపర్ కింగ్స్‌లో చోటు

చెన్నై: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడో యంగ్ క్రికెటర్. అతని పేరు మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. వయస్సు 22 సంవత్సరాలు. స్వస్థలం రాయచోటి. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. తొలివిడత మినీ ఐపీఎల్ వేలంపాటలో ఆయనకు ఛాన్స్‌ లభించింది. 292 మందికి మాత్రమే ఇందులో అవకాశం లభించింది. ఆ 292 మంది క్రికెటర్లలో మారంరెడ్డి ఉన్నారు.

రూ. 20 లక్షల బేస్ ప్రైజ్..

తాజాగా చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్ వేదికగా సాగిన వేలంపాటలో హరిశంకర్ రెడ్డిని సొంతం చేసుకుంది ధోనీ సేన. మారంరెడ్డి బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలు. అదే మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం అతను ఆంధ్రా క్రికెటర్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2018 జనవరి 11వ తేదీన ఆంధ్రా-కేరళ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌తో క్రికెట్‌లో అడుగు పెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన ఆయన 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను తీశాడు.

టీ20 ఫార్మట్‌లో నిలకడగా..

ఇప్పటిదాకా మారంరెడ్డి 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కిందటి నెల 15వ తేదీన ముంబైలో పుదుచ్చేరి టీమ్ మీద 35 పరుగులకు మూడు వికెట్లను తీసుకున్నాడు. కొంతకాలంగా అతను దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆ అనుభవంతోనే ఐపీఎల్‌ మినీ ఆక్షన్‌లో ఎంట్రీ లభించింది. అదృష్టం అతని తలుపు తట్టింది. ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, జేసన్ రాయ్.. వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఐపీఎల్‌లో చోటు దక్కించుకోవడంలో విఫలమైన చోట.. హరిశంకర్ రెడ్డికి అవకాశం దక్కింది.

 ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే ఛాన్స్

ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే ఛాన్స్

మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అరుదైన అవకాశం మారంరెడ్డికి దక్కినట్టయింది. అతణ్ని బాహుబలిగా అభివర్ణించింది సీఎస్‌కే టీమ్. అదే పేరుతో ట్వీట్ చేసింది. ఇది వరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత కడప జిల్లా నుంచే మరో యంగ్ క్రికెటర్ మారంరెడ్డి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+