కడపలో కదం తొక్కిన బీజేపీ,జనసేనలు ..జగన్ పాలన అరాచకం అని నిప్పులు
ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కడప జిల్లాలో బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ, జనసేన పార్టీల నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని అంబేద్కర్ కూడలిలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.ఇక ఈ సందర్భంగా ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు పలువురు జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు నశించాలని, తక్షణం తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివెయ్యాలని వారు డిమాండ్ చేశారు.

వివేకాది గుండెపోటు అని చెప్పి గుండెల్లో పొడిచిందెవరో తెలుసన్న ఆదినారాయణ రెడ్డి
ఇక ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ నేత , మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వైసీపీ లాంటి అసమర్ధ, అరాచక ప్రభుత్వానికి చెక్ పెట్టాలని పేర్కొన్నారు .ఇక అంతే కాదు వివేకా హత్య కేసును గురించి ప్రస్తావిస్తూ వివేకాది మొదట గుండెపోటు అని చెప్పి గుండెల్లో పొడిచిందెవరో అందరికీ తెలుసని ఆయన విమర్శించారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని జగనే కోరాడని ఇప్పుడు తానె వద్దని చెప్తునారని, అందులో మతలబు ఏంటో అందరికీ తెలుసనీ పేర్కొన్నారు.

ఏపీలో జగన్ పులి.. ఢిల్లీలో పిల్లి అని వ్యాఖ్యలు
జగన్ ఇక్కడ ఏపీలో పులి అని ఇక ఢిల్లీ వెళ్తే తమ అధినాయకులైన బీజేపీ పెద్దల ముందు పిల్లి అని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ కడపలో పుట్టినప్పటికీ కడప పౌరుషాన్ని అవమానిస్తున్నారన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక నేటి వరకు అరాచకమే రాజ్యమేలిందని ఆయన పేర్కొన్నారు . వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడాలని మాజీ మంత్రి , బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు .

జగన్ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని కన్నా విమర్శలు
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ మంచి పాలన అందిస్తారని ప్రజలు భావించారని కానీ అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు.అధికారం చేపట్టిన తర్వాత జగన్ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ రాక్షస పాలనను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.తక్షణం తమ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివెయ్యాలని డిమాండ్ చేశారు .
Recommended Video


బీజేపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై విమర్శలు గుప్పించిన మీరు ఇప్పుడు చేస్తున్నదేంటని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలంతా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు కన్నా . ఇక వైసీపీ నేతలు కావాలనే బీజేపీ నేతలపై కేసులు బనాయిస్తూ శునకానందం పొందుతున్నారని విమర్శించారు. మోదీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకప్రతిపక్షాలు నక్క జిత్తుల వ్యవహారాలు చేస్తున్నాయని కన్నా విమర్శించారు. వైసీపీ పాలనపై ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని కన్నా అభిప్రాయపడ్డారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?











Click it and Unblock the Notifications