వైఎస్ షర్మిల షెడ్యూల్‌లోనూ సడన్ ఛేంజ్: తండ్రి సమాధి వద్దే..: ఈ సాయంత్రమే కడపకు
కడప: తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. కడప జిల్లా పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు వైఎస్ జగన్ షెడ్యూల్‌లోనూ చివరి నిమిషంలో మార్పులు సంభవించాయి. తన చెల్లెలి షెడ్యూల్‌తో సంబంధం లేకుండా.. దాన్ని కాస్త వెనక్కి జరిపారు. తాజాగా- వైఎస్ షర్మిల ఇడుపులపాయ షెడ్యూల్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం షర్మిల బెంగళూరులో నివసిస్తోన్న వైఎస్ షర్మిల.. ఈ సాయంత్రమే ఆమె ఇడుపులపాయకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి సాయంత్రం 4 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గాన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్తారు. రాత్రి అక్కడ బస చేస్తారు. తన తండ్రి నడయాడిన ప్రదేశం కావడం వల్ల ఒకరోజు ముందే అక్కడికి చేరుకుంటే బాగుంటుందని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం ఆమె 8 గంటలకు వైఎస్సార్ ఘాట్‌ను సందర్శిస్తారు. తండ్రికి నివాళి అర్పిస్తారు. అనంతరం అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ముదురు నీలం, పాలపిట్టరంగు, మధ్యలో శ్వేతవర్ణంతో తెలంగాణ చిత్రపటం.. దానిపై వైఎస్సార్ ఫొటో ముద్రించిన జెండాను ఇదివరకే వైఎస్ షర్మిల ఖాయం చేశారు. దాన్ని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆవిష్కరించే అవకాశం ఉంది. అనంతరం ఆమె మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి నేరుగా విష్పర్ వ్యాలీలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌కు చేరుకుని, పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. జెండాను లాంఛనప్రాయంగా ఆవిష్కరిస్తారు. విధి విధానాలు, మార్గదర్శకాలనూ తెలియజేస్తారు. ఆ తరువాత లోటస్ పాండ్ నివాసంలో పార్టీ నేతలు, జిల్లా సమన్వయకులతో సమావేశమౌతారు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయంపై ఇప్పటికే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను షర్మిల రూపొందించుకున్నారు. దాన్ని అమలు చేయడంపై చర్చిస్తారు.












Click it and Unblock the Notifications