కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ట్విస్ట్ .. ఆ నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు

|
Google Oneindia TeluguNews

Recommended Video

వివేకా హత్యకేసులో ట్విస్ట్.. నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు ! || Oneindia Telugu

వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు .. ఏపీలో ఒక మిస్టరీగా మారిన కేసు ఇది . ఇక ఈ కేసుపై జగన్ దృష్టి సారించారు. అందుకే కొత్త సిట్ ను నియమించి విచారణ వేగవంతం చేయించారు. ఇదిలా ఉంటె మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైన వెంకట కృష్ణారెడ్డి, ప్రకాష్ లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి న్యాయమూర్తి పిటీషన్ ను డిస్మిస్ చెయ్యటానికి సిద్ధం కాగా పిటిషన్ల ను ఉపసంహరించుకుంటున్నామని పిటీషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. దీనికి కోర్టు అంగీకరించింది.

2024లో జనసేన సత్తా చూస్తారు అంటున్న మెగా బ్రదర్ నాగబాబు .. పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు 2024లో జనసేన సత్తా చూస్తారు అంటున్న మెగా బ్రదర్ నాగబాబు .. పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆకస్మిక మలుపు.. బెయిల్ కోరిన వివేకా హత్యకేసు నిందితులు

వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆకస్మిక మలుపు.. బెయిల్ కోరిన వివేకా హత్యకేసు నిందితులు

వివేకా హత్యా కేసులో ట్విస్ట్ నెలకొంది.మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆకస్మిక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టు నిర్ణయం తీసుకునే ముందే పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని నిందితుల తరపు న్యాయవాది బిఆర్ రెడ్డి తెలిపారు . నిందితుడు వివేకానందరెడ్డి పిఏగా పని చేసిన ఎం వెంకట కృష్ణారెడ్డి, నిందితుడు ప్రకాష్ లకు సాక్ష్యాలను రూపు మాపి హత్యకు సహకరించిన కారణంతో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . ఇక వీరు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది.

వాదన వినిపించిన పిటీషనర్ల తరపు న్యాయవాది .. బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి

వాదన వినిపించిన పిటీషనర్ల తరపు న్యాయవాది .. బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి

పిటీషనర్ల తరపు న్యాయవాది ఎన్నికలకు ముందు ఏపీలో ముఖ్య నేత అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని ఇక అప్పటి ప్రభుత్వం దాని ప్రభావం అధికార పార్టీ మీద పడుతుందన్న ఉద్దేశంతో వెంకట కృష్ణా రెడ్డిని, ప్రకాష్ లను అరెస్ట్ చేశారని, ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారని పేర్కొన్నారు. హత్య నేపధ్యంలో పోలీసులు హడావిడిగా ప్రవర్తించారని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పేందుకే ఎం వెంకట కృష్ణారెడ్డి, ప్రకాష్ లను అరెస్ట్ చేశారని తెలిపారు . అన్యాయంగా అరెస్ట్ చేశారని ,ఇప్పటికే 60 రోజులు శిక్ష అనుభవించారని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. బెయిల్ కు నో చెప్పిన న్యాయమూర్తి

పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. బెయిల్ కు నో చెప్పిన న్యాయమూర్తి

ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ వివేకా హత్యానంతరం సాక్ష్యాలను రూపు మాపే ప్రయతం నిందితులు చేశారని, ఇప్పుడు బెయిల్ ఇచ్చి బయటకు పంపితే మరింతగా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని, దాని ప్రభావం కేసుపై పడుతుందని పేర్కొన్నారు. 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదై ఉన్నందున 90 రోజుల జైలు జీవితం అనుభవించిన తర్వాతే బెయిల్ అడగటానికి వీలుంది. కాబట్టి నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని తమ వాదన వినిపించారు. పీపీ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటీషనర్ల అభ్యర్థనలను తిరస్కరిస్తూ డిస్మిస్ చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే పిటీషనర్ల తరపు న్యాయవాది పిటీషన్ ఉపసంహరించుకుంటామని చెప్పటంతో కోర్టు అంగీకరించింది .

English summary
Former Minister YS Vivekanand murder case witnessed a sudden twist. Andhra Pradesh High Court has rejected the bail plea of two accused pertaining to the case. The petitioner of the accused BR Reddy has decided to withdraw the petition even before the high court took a decision to dismiss the petition. Accused number 2 M Venkat Krishna Reddy and accused number 3 E Prakash have approached the High Court seeking bail. The justice of the High Court BVSS Somayajulu has gone through the petition of the accused on Thursday. On the other hand, Public Prosecutor Posani Venkateswarulu said his version that if the two accused are released on bail, they may tamper the evidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X