కరీం నగర్ లో వికసించిన కమలం .. వినోద్ కుమార్ పై బండి సంజయ్ ఘన విజయం

కరీంనగర్ ప్రజలు కారు కు నో అన్నారు. కాషాయానికి జై కొట్టారు . లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు హోరాహోరీగా జరిగింది. టీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ ఇచ్చి చివరకు టీఆర్ఎస్ ను ఓడించారు బండి సంజయ్.

కరీంనగర్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో, రాష్ట్రం ఆవిర్భివంచిన తర్వాత కేసీఆర్‌కు వినోద్ కుమార్ కుడిభుజంగా ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాలను కేంద్రస్థాయిలో చక్కదిద్దుతూ వచ్చారు. కరీంనగర్ స్థానంలో వినోద్ కుమార్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపొందారు. 89,508 ఓట్ల భారీ మెజార్టీతో గహన విజయం సాధించారు బండి సంజయ్ .

Karimnagar bloomed on Kamalam .. Bandi Sanjay solid victory on Vinod Kumar

గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన బండి సంజయ్ టీఆర్ఎస్ నుంచి బి.వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ ను ఓడించి విజయం సాధించారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో కాషాయం పార్టీ బీజేపీ పరువు దక్కించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+