కొప్పుల ఈశ్వర్ కాంట్రవర్సీ కామెంట్స్: ఎంపీటీసీతో వ్యాఖ్యలు, ఈసీ విచారణకు కాంగ్రెస్ పట్టు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జోష్ కొనసాగుతోంది. వచ్చేనెల 10వ తేదీన పోలింగ్ జరగనుండటంతో.. సభ్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీటీసీ సభ్యులు ఓటు వేయడంతో విజయం వరిస్తోంది. ఇప్పటికే అంతా క్యాంపులకు వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీటీసీ సభ్యుడితో ఫోన్‌లో జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీటీసీ సభ్యులపైనా, నామినేటెడ్‌ పదవిలో ఉన్న ఓ నాయకుడిపైనా మంత్రి చేసిన వ్యాఖ్యల ఆడియో లీక్‌ అయి.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 ఎంపీటీసీకి ఫోన్

ఎంపీటీసీకి ఫోన్

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వ ర్లుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ చేశారు. వెంకటేశ్‌! అందరినీ జమ చేస్తున్నవట అంటూ సంభాషణ ప్రారంభించారు. అవతలి వాళ్లిచ్చే రూ.50 వేలే కావాలా? మేమిచ్చేది అవసరం లేదా? అంటూ ప్రశ్నించారు. తాను ఎవరినీ జమ చేయలేదని, తన వద్దకు వస్తే తీసుకోలేదని వెంకటేశ్వర్లు చెప్పారు. అయితే అందరూ నీ పేరే చెప్తున్నారు.. ఏదైనా ఉంటే తనతోనే మాట్లాడు అని సూచించారు. వాళ్ల, వీళ్ల పేరు ఎందుకు చెప్పుతావ్‌? పైసలు కావాలంటే ఇప్పించేది తనేనని చెప్పారు.

900 మంది ఉన్నారు..

900 మంది ఉన్నారు..

ఏం చేయాలన్నా చేసేది మనమే.. ఇతరులకు మంది ఉన్నరా? అని అడిగారు. మనకు 900 మంది ఉన్నారని మంత్రి కొప్పుల అన్నారు. తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి వద్దకూ వెళ్లలేదని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. కొందరు అంటూ మంత్రి కొప్పుల దుర్భషలాడారు. రఘువీర్‌సింగ్‌ అని పేరు తీసి అసభ్య పదజాలంతో దూషించాడు.

పుట్ట మధు వాళ్లు ఈటల రాజేందర్‌తో పోతరు. నువ్వు కూడా పోతవా? అని మంత్రి ప్రశ్నించారు. తనకు ఆ అవసరం లేదని వెంకటేశ్‌ చెప్పగా.. ఎవరన్నా వస్తే తన వద్దకు తీసుకురావాలని మంత్రి అన్నారు. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని మంత్రి వ్యాఖ్యలపై విచారణ జరపాలని, ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

10వ తేదీన ఎన్నిక

10వ తేదీన ఎన్నిక

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేశారు. నవంబర్ 16వ తేదీన నోటిఫికేషన్, నవంబర్ 23వ తేదీన నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ ఇచ్చారు. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్, డిసెంబర్ 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+