భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్.. భగ్నం చేసిన భద్రాద్రి పోలీసులు
కొత్తగూడెం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కదలిక కలకలం రేపింది. ఇటు పోలింగ్ జరుగుతుంటే అటు మావోయిస్టులు విధ్వంసానికి ప్లాన్ చేయడం గమనార్హం. మొత్తానికి పోలీసులు అలర్ట్ గా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం. పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పైపుల్లో బాంబులు అమర్చి బ్లాస్టింగ్ చేయడానికి సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది.
అయితే విశ్వసనీయ సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారి కుట్రను చేధించారు. చర్లలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎన్నికల వేళ విషయం బయటకు పొక్కితే ఆందోళన చెందే అవకాశం ఉండటంతో వారిని రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం.













Click it and Unblock the Notifications