పొంగులేటి నిర్ణయం మారిందా - ఆ నేత ఎంట్రీతో కొత్త ట్విస్ట్..!?

మాజీ ఎంపీ పొంగులేటి రాజకీయంలో కొత్త ట్విస్టు. బీఆర్ఎస్ నుంచి పొంగులేటి మరో పార్టీలో చేరటం ఖాయం. బీజేపీలోకి వెళ్లటం ఖాయమని భావిస్తున్న వేళ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
బీజేపీలోకి వెళ్తున్నారా..నిర్ణయం మారిందా. ఏం జరుగుతోంది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సత్తా చాటాలనేది పొంగులేటి లక్ష్యం. పొంగులేటి డిమాండ్లకు అంగీకరించేందుకు బీజేపీ సిద్దంగా ఉందా. బీజేపీలోకి వెళ్లటం ఖాయమని భావిస్తున్న వేళ రాష్ట్రానికి చెందిన ఒక కీలక నేత ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో..ఇప్పుడు పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తున్నారు.. రెండు జాతీయ పార్టీల నుంచి వస్తున్న ఆహ్వానాలతో పొంగులేటి నిర్ణయం ఏంటనేది సస్పెన్స్ గా మారుతోంది.

అనుచరులతో వరుస మంతనాలు

అనుచరులతో వరుస మంతనాలు

పొంగులేటి బీఆర్ఎస్ వీడుతున్నట్లు అనుచరులకు స్పష్టం చేసారు. నాలుగేళ్లుగా పార్టీలో వేచి చూసినా..ప్రాధాన్యత కాదు గుర్తింపు కూడా దక్కటం లేదని తన అభిప్రాయాలను ముఖ్యులతో షేర్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వీడి..ఏ పార్టీలో చేరితే బాగుంటుందంటూ తన అనుచర వర్గం నుంచే అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మెజార్టీ అభిప్రాయం బీజేపీలో చేరాలని వచ్చింది. కానీ, పొంగులేటి మాత్రం తాను బీజేపీలో చేరుతున్నట్లుగా ఓపెన్ గా చెప్పటం లేదు. ఇప్పటి వరకు పొంగులేటి అనుచర వర్గం మాత్రం బీజేపీలో చేరటానికి రంగం సిద్దం అవుతుందని చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనకు పొంగులేటి పార్టీలో చేరిక పైన ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

పొంగులేటికి రేవంత్ ఆఫర్..?

పొంగులేటికి రేవంత్ ఆఫర్..?

పొంగులేటి బీజేపీలోకి వెళ్లాలని భావిస్తున్న సమయంలో టీపీసీసీ చీఫ్ మంతనాలు ప్రారంభించినట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో బీజేపీలో బలం లేదని, కాంగ్రెస్ కు ఉన్న బలంకు పొంగులేటి చేరికతో జిల్లాలో సానుకూల ఫలితాలు వస్తాయని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పొంగులేటి కి పార్టీలో ప్రాధాన్యత..అనుచరులకు టికెట్ల విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో, రెండు జాతీయ పార్టీల్లో ఎటువైపు పొంగులేటి మొగ్గు చూపుతారనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో కొత్తగూడెంలో పొంగులేటి తన అనుచరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. జిల్లాలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలతో పొంగులేటి మధ్య సత్సంబంధాలు లేవు. బీజేపీలో చేరితే..జిల్లాలో ఎటువంటి మద్దతు ఉంటుందనే అంశం పైన ప్రస్తుతం పొంగులేటి తన వరుస సమావేశాల్లో అనుచరులతో చర్చలు చేస్తున్నారు.

బీజేపీలోకా -కాంగ్రెస్ లో ఎంట్రీ ఇస్తారా

బీజేపీలోకా -కాంగ్రెస్ లో ఎంట్రీ ఇస్తారా

ఖమ్మంకు చెందిన కాంగ్రెస్ కార్పోరేటర్లు తాజాగా పొంగులేటిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో, పొంగులేటి బీజేపీ ఆలోచనలతో పాటుగా కాంగ్రెస్ పైన ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పొంగులేటి భేటీ కావాల్సి ఉంది. కానీ, భేటీ జరగలేదు. అనుచర వర్గం నుంచి మెజార్టీ అభిప్రాయం బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ సరైన పార్టీగా చెబుతున్నా.. ప్రజల్లో బీజేపీ కంటే జిల్లాలో కాంగ్రెస్ కు ఆదరణ ఉందనే అంశాన్ని పొంగులేటి సన్నిహితులు ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీల్లో పొంగులేటి ఎటు వైపు మొగ్గుతారనేది ఈ నెల 26న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ రోజున పొంగులేటి తన రాజకీయ భవిష్యత్ అడుగుల పైన క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+