కొత్తగూడెం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

12 ఏళ్ల తర్వాత ఊరికి బస్సు.. అంతా సజ్జనార్ సార్ వల్లే

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్.. ఒక్కో కీలక అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఏళ్లుగా జరగని పనులను చకచకా చేస్తున్నారు.
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంస్థకు ఆదాయంపై ఫోకస్ చేశారు. దసరా సమయంలో సిటీ నుంచి జనం ఊర్లకు వెళుతుంటారు. అప్పుడు అదనపు చార్జీ లేకుండా బస్సులను నడిపించారు. మంచి ఆదాయమే సమకూరింది. ఆర్టీసీలో కొన్ని విభాగాలకు కొలువులను ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులను పెళ్లి కోసం బుక్ చేసుకుంటే గిప్టులను అందజేస్తున్నారు. ఈసారి జర్నలిస్టులకు కూడా గుడ్ న్యూస్ అందజేశారు. 2/3 ఆన్ లైన్ చేశారు. తర్వాత అడిగిన సమస్యలపై కూడా స్పందిస్తున్నారు.

12 ఏళ్ల తర్వాత

12 ఏళ్ల తర్వాత

గ్రామానికి బస్ సర్వీసు ఆపేసి 12ఏళ్లు దాటేసింది. రోడ్ బాగాలేదని, ప్రయాణికుల రద్దీ ఉండటం లేదని సర్వీస్ నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ సదుపాయం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు సర్వీసు శుక్రవారం నుంచి స్టార్ట్ అయ్యింది. గ్రామానికి చెందిన చెవుల బాలరాజు అనే వ్యక్తి నవంబర్ 7న ట్విట్టర్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. రూట్‌ మ్యాప్‌ పరిశీలించి గ్రామానికి బస్సు నడపాలని కొత్తగూడెం డిపో మేనేజర్‌ వెంకటేశ్వరబాబుకు ట్విట్టర్ ద్వారానే సూచించారు.

 చర్చలు జరిపి.. చివరికీ

చర్చలు జరిపి.. చివరికీ

దీనిపై ప్లానింగ్ చేసిన 11న సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మాంచా నాయక్, కంట్రోలర్‌ జాకంతో కలిసి కొత్తగూడెం డిపో మేనేజర్ గ్రామానికి చేరుకుని చర్చలు జరిపారు. సాధ్యాసాధ్యాలపై సమీక్షించి అనంతరం సర్వీసు ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. 12 ఏళ్ల తర్వాత తమ గ్రామానికి బస్సు రావడంతో సంబరాలు చేసుకున్న గ్రామస్తులు బస్సుకు మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు కట్టి స్వీట్లు పంచుకున్నారు.

 శ్రీరామ్‌కే ఓటు

శ్రీరామ్‌కే ఓటు

ఇంతకుముందు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక వీడియో ద్వారా శ్రీరామ్ చంద్ర బిగ్ బాస్‌లో అద్భుతంగా గేమ్ ఆడుతున్నడని, పాట‌లు కూడా బాగా పాడుతాడని పేర్కొన్నారు. ఈ సారి ఆయ‌నే క‌ప్ గెలుస్తాడ‌నే న‌మ్మకం ఉంద‌న్నారు. ఈ వీడియోని శ్రీరామ చంద్ర ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఇక శ్రీరామ్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. సజ్జనార్‌కి జనాల్లోమంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్‌తో శ్రీరామ్ చంద్రకి కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంది. ఇలా ప్రతీ అంశంపై సజ్జనార్ స్పందిస్తున్నారు.

English summary
12 years after rtc bus come to bhadradi kothagudem district kakarla village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X