ఏపీలో ఇద్దరు బాలికలపై అత్యాచార యత్న ఘటనలు .. చిత్తూరు,కర్నూలులో దారుణాలు
దేశంలో మహిళలపై దాడులు, బాలికలపై అత్యాచారాలు ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతున్నా , బాలిక సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నా నేరాలు తగ్గటం లేదు. బాలికలపై అత్యాచార ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక దారుణం ఒక మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు పంపించేలా చేసింది. కర్నూలు జిల్లాలో జరిగిన మరో దారుణంలో బాలిక కేకలు వెయ్యటంతో అత్యాచార యత్నం చేసిన యువకుడు పారిపోయాడు.

9వ తరగతి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేసిన బాలుడు
చిత్తూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఓ మైనర్ బాలుడు 9వ తరగతి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం స్కూల్స్ కొనసాగడం లేదు. అయినప్పటికీ తల్లిదండ్రులు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తే పిల్లలను స్కూల్ అనుమతిస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ క్రమంలో ప్రత్యేక తరగతుల కోసం పాఠశాలకు వెళ్లిన ఒక విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన ఒక బాలుడు అత్యాచార యత్నం చేశాడు.

స్కూల్ ఆవరణలోనే దారుణం .. కేసు నమోదు చేసి జువైనల్ హోం కు పంపిన పోలీసులు
ఉదయం ఇంటి నుంచి స్కూలుకు వెళ్లిన విద్యార్థిని, మధ్యాహ్నం అయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయ్యారు. స్కూల్ లో ఎవరూ లేని సమయం చూసి బాలుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడుతూ కనిపించగా బాలుడి పట్టుకొని పోలీసులకు అప్పగించి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అత్యాచారయత్నానికి పాల్పడింది మైనర్ బాలుడు కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారని సమాచారం .

బహిర్భూమికి వెళ్లి వస్తున్న మరో బాలికపై యువకుడి అత్యాచార యత్నం .. కేసు నమోదు
కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల బలపాల పల్లె గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక బహిర్భూమికి వెళ్లి వస్తుండగా పరమేశ్ అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బాలిక కేకలు వేయడంతో సదరు యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications