వైఎస్ జగన్ గెలుపుకు బీజేపీ బ్లెస్సింగ్స్ కారణమన్న ఎంపీ ... రాహుల్ గాంధీపైన కూడా షాకింగ్ వ్యాఖ్యలు
కర్నూలు ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ గత ఎన్నికల్లో గెలవడానికి కారణం బీజేపీ బ్లెస్సింగ్స్ అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బిజెపి బ్లెస్సింగ్స్ తో గెలిస్తే, గత ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజెపి బ్లెస్సింగ్స్ తో గెలిచారన్నారు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీకి మద్దతుగా ఉందని భవిష్యత్ లో రాష్ట్రంలో రాజ్యాధికారం తప్పక బీజేపీ చేపడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం నిధులను వైసీపీ మ్యానిఫెస్టోలో పథకాలకు వాడుతున్నారన్న ఎంపీ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి విషయాన్ని కాంట్రవర్సి చేస్తున్నారని, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తీసుకువస్తున్నారని వెంకటేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇసుక సమస్య లేదని,కానీ సీఎం జగన్ ఇసుక సమస్యను జటిలం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక కేంద్రప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను వైసీపీ మేనిఫెస్టో లోని పథకాల కోసం ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో అమలవుతున్న పథకాలన్నింటిలో కేంద్ర నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రం మీద కేంద్రానికి నమ్మకం పోయేలా వైసీపీ పాలనా తీరు
రాష్ట్ర ప్రభుత్వ తీరుతో కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం మీద నమ్మకం పోతుందని ఎంపీ టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఏపీలో సంక్షేమపథకాలలో ఆర్థిక సహాయం చేస్తూ తాత్కాలిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయని,అలా కాకుండా శాశ్వత ప్రయోజనం చేకూర్చేలాగా నిర్ణయాలు ఉండాలని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ లకు డబ్బులు ఇవ్వడం కంటే వారికి ఎలక్ట్రిక్ ఆటోలను కొని ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు.జగన్ పరిపాలనా తీరు మారాలని టీజీ అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ప్రధానిగా రాహుల్ ఉంటే ప్రధాని పదవి వద్దని పారిపోయేవాడు
ఇక అంతే కాదు ప్రధాని నరేంద్రమోడీ లేకుంటే దేశ పరిస్థితి దారుణంగా ఉండేదని బిజెపి ఎంపీ టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. పీఎం మోడీ వల్లే ప్రస్తుతం ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్ ప్రస్తుతం ప్రధానిగా మోడీ స్థానంలో రాహుల్ గాంధీ ఉండి ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దని పారిపోయినట్లుగా, దేశ ప్రధాని పదవి కూడా వద్దని పారిపోయే వారని టి.జి.వెంకటేష్ ఎద్దేవా చేశారు.

మోడీ పాలనాలో ఎన్నో కీలక నిర్ణయాలు .. దేశ రక్షణలో మోడీ మార్క్
మోడీ పాలన చేపట్టిన తర్వాత ఊహించని విధంగా కీలక నిర్ణయాలు తీసుకుని దేశ పాలనలో తన మార్కు చూపించారన్నారు. ఆరేళ్ళ పాలనలో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్, అయోధ్య వివాదం, ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళలకు రక్షణ కల్పించారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. మోడీ లేకుంటే చైనా , పాకిస్తాన్ , నేపాల్ లు తలా ఒక ముక్క భారత భూభాగాన్ని తీసుకువెళ్ళేవారని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు . ఏది ఏమైనా టీజీ వెంకటేష్ ఎప్పుడు మాట్లాడిన ఆసక్తికరమైన,సంచలన వ్యాఖ్యలు చేస్తారనేది నిర్వివాదాంశం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications