తెలంగాణలో ‘కల్లు బార్లు’

మహబూబ్‌నగర్: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 'కల్లు బార్లు' ఏర్పాటు దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కులవృత్తులు మారుతున్నాయన్నారు.

నేటికాలంలో అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోందని, వాటితో పాటు గీత కార్మికుల కులవృత్తిని ఆధునీకరించుకునే అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో "కల్లు బార్లు" ఏర్పాటు చేసుకునే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ప్రకృతిపరంగా వచ్చే పానీయాన్ని కల్తీ లేకుండా గౌరవప్రదంగా అమ్మే విధంగా చర్యలు చేపడతామమని మంత్రి పొన్నం తెలిపారు.

Kallu Bars in telangana soon minister ponnam prabhakar

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి నేటికి 90 రోజులైందని, ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు మంత్రి పొన్నం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయణం చేశారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, కేంద్రంలోనూ మన రాష్ట్రం నుంచి పార్లమెంట్‌ సభ్యులు ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పొన్నం పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా వివక్షకు గురయ్యిందని విమర్శించారు. జిల్లాలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రాబోయే ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు లేదన్నారు. గడిచిన శాసనసభల్లో లక్ష కోట్లు అప్పు మాత్రమే ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఏడాదికి రూ.60 వేల కోట్ల రూపాయల వడ్డీతో కలుపుకొని, రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+