రాకేశ్ కోసం సుజాత పోరుబాట.. భర్త, పిల్లలు కూడా వద్దట, పీఎస్ ముందు హల్‌చల్

ఏం కాలమో తెలియడం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఎందుకో బోధపడటం లేదు. భర్త.. పిల్లలు ఉన్నా.. వివాహిత.. భార్య, పిల్లలు ఉన్న భర్త కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. కొందరు చేసే పని మరికొందరినీ ఇబ్బంది పెడుతోంది. తాజాగా వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది.

రాకేశ్‌పై మోజు..

రాకేశ్‌పై మోజు..

పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నవివాహిత ప్రియుడిపై మోజు పడింది. మొగుడు, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. వారు వద్దని, ప్రియుడితోనే కలిసి ఉంటానని పోలీసులను కోరింది. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సుజాతకు పెళ్లైంది. భర్త, పదేళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు ఉన్నారు. అమరచింతలో వారు ఉంటున్న కాలనీకే చెందిన రాకేష్ అనే యువకుడితో సుజాతకు పరిచయం ఏర్పడింది. అదీ కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

నెల క్రితం పారిపోయి.. సహజీవనం

నెల క్రితం పారిపోయి.. సహజీవనం

ప్రియుడి మోజులో ఉన్న సుజాత భర్త, పిల్లల్నివదిలేసి నెల రోజుల క్రితం పారిపోయింది. వరంగల్‌లో భార్యభర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి కోసం రెండు కుటుంబాల వారు తీవ్రంగా గాలించారు. చివరకు వరంగల్ లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మే 21న రాకేష్ కుటుంబసభ్యులు వరంగల్ చేరుకున్నారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి అమరచింత తీసుకువచ్చారు. సుజాతను ఆమెభర్త వద్ద దింపి.. రాకేష్‌ను వారింటికి తీసుకువెళ్లారు.

పీఎస్ వద్ద ధర్నా..

పీఎస్ వద్ద ధర్నా..

సోమవారం మే 24వ తేదీ ఉదయం సుజాత అమరచింత పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. తాను రాకేష్ తోనే కలిసి జీవిస్తానని.. ఇద్దరం వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఎన్ని కష్టాలెదురైనా రాకేష్ తోనే ఉంటానని తెలిపింది. రాకేష్ పై, తనపై వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని ...అతనిను తననుంచి దూరంచేశారని చెప్పింది.

Recommended Video

    Top 5 Most Beautiful Indian Woman Athletes || Oneindia Telugu
    ఏంటీ ఇదీ..

    ఏంటీ ఇదీ..

    రాకేష్ ను ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితో మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా మొబైల్ కూడా అందుబాటులో లేకుండా చేశారని నిట్టూర్చింది. సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ చెప్పారు. ఈ ఘటన కలకలం రేపింది. భర్త, పిల్లలను వద్దనుకోవడం ఏంటీ అని ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+