నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8 ఎకరాల భూమి కొని 20 ఏళ్లు అవుతుంది.. ఇప్పటివరకు నో పాస్ బుక్.. సూసైడ్ అటెంప్ట్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కూడా అవే తప్పులు.. అదే నిర్లక్ష్యం.. ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతకు గురవుతున్నామనే ఫీల్ ఉండేది.. అందుకోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. కానీ రాష్ట్రం ఏర్పడి ఏఢేళ్లు అవుతున్నా.. ఏ విభాగం పరిపుష్టం కాలేదు. సీఎం మాటల్లో పనితీరు కనిపిస్తుంటుంది. కానీ చేతల్లో మాత్రం లేదు. అవును భూముల రిజిస్ట్రేషన్ అనీ, ధరణి పోర్టల్ అని అన్నీ ఆన్ లైన్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. అవును ఓ తండ్రి కొడుకు కలిసి కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

సూసైడ్ అటెంప్ట్

సూసైడ్ అటెంప్ట్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. భువనగిరి కలెక్టరేట్ వద్ద తండ్రి కొడుకులు సూసైడ్ అటెంప్ట్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. అధికారులు తమ భూమికి పాసు పుస్తకం ఇవ్వడం లేదని.. ఉప్పలయ్య, అతడి కుమారుడు మహేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అయితే అధికారులు అప్రమత్తమై వారిని కాపాడారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆలేరు మండలం కొలనుపాకలో తమకు 4 ఎకరాల భూమి ఉందని ఉప్పలయ్య తెలిపాడు. ఆ భూమిని 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇప్పటివరకు పాస్ బుక్ జారీచేయలేదని వాపోయాడు.

20 ఏళ్లు అవుతున్నా..

20 ఏళ్లు అవుతున్నా..

పాస్ బుక్ కోసం అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి తట్టుకోలేకనే తాము కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించారు. తమకు న్యాయం జరగదనే అనుమానంతోనే తాము ఇలా చేసినట్లు తెలిపారు. తమ భూమికి పాస్ బుక్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. వాస్తవానికి ధరణి పోర్టల్‌తో అన్నీ ఆన్ లైన్ చేశారు. మిగతా వారి భూములు అన్నీ ఆన్ లైన్ అవుతున్నాయి. వారి ఉప్పలయ్యది ఎందుకు కావడం లేదో తెలియడం లేదు. ఏదైనా సమస్య ఉంటే చెప్పాలీ.. కానీ ఇలా వేధించడం తగదు.

జర చూడండి సార్

జర చూడండి సార్


తండ్రి కొడుకులు అధికారల తీరుతో విసిగి వేశారు. ఇక లాభం లేదనుకుని చివరీ ప్రయత్నం చేశారు. దీంతో అయినా వారి సమస్య ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. సీఎం సార్.. వారి సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. వారి సమస్యను పరిష్కరించాలని మనం కోరుకుందాం.

English summary
father and son suicide attempt at bhuvanagiri collectorate. they bought land 8 acres 20 years ago but still they dont have passbook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X