నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీఆర్ఎస్ తో దేశాన్ని గెలుస్తావా? ముందు నాపై గెలువు కేసీఆర్: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్!!

|
Google Oneindia TeluguNews

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిని మించి ఒకరు మాటల యుద్ధానికి తెరతీశారు. బిజెపిని టార్గెట్ చేసి టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు వ్యాఖ్యలు చేస్తుంటే, టిఆర్ఎస్ పార్టీ నేతలకు, సీఎం కేసీఆర్ కు నేరుగా సవాల్ విసురుతున్నారు మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ప్రజలు కేసీఆర్ ను లైట్ తీసుకుంటున్నారు

ప్రజలు కేసీఆర్ ను లైట్ తీసుకుంటున్నారు


తాజాగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలను డైవర్ట్ చేయడం ఆయనకు అలవాటు అని పేర్కొన్నారు. పథకాల పేరుతో కెసిఆర్ ప్రజలముందుకు వచ్చినా ప్రజలు ఆయనను లైట్ తీసుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాడని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కెసిఆర్ ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికలకు భయపడి పథకాలు

ఎన్నికలకు భయపడి పథకాలు


తన ఆత్మ గౌరవం కోసం రాజీనామా చేస్తానని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి, మునుగోడు అభివృద్ధి కోసం ఆయనను కలిస్తే కనీసం టైం కూడా ఇవ్వలేదని, ఉప ఎన్నికలకు భయపడి ఇప్పుడు పథకాలు తీసుకొస్తున్నారు అంటూ కెసిఆర్ ను టార్గెట్ చేశారు. గతంలో టీఆర్ఎస్ అంటే పేరులో తెలంగాణ ఉంది కాబట్టి ముందు తెలంగాణ గుర్తొచ్చేది అని, ఇప్పుడు తెలంగాణ ద్రోహి బీఆర్ఎస్ గా మార్చడంతో ఆ పదం కాస్త పోయిందని వ్యాఖ్యలు చేశారు.

నువ్వే పోటీ చెయ్.. నాపై గెలిచి తర్వాత దేశం మీదకు వెళ్ళు

నువ్వే పోటీ చెయ్.. నాపై గెలిచి తర్వాత దేశం మీదకు వెళ్ళు


బీఆర్ఎస్ తో ఎన్నికలకుపోతే కేసీఆర్ కు వీఆర్ఎస్ తప్పదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలలో కెసిఆర్ ఇచ్చే డబ్బులు తీసుకుంటారు కానీ ఓటు బీజేపీ కి వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా కేసీఆర్ కు చరమగీతం తప్పదని పేర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బి ఆర్ ఎస్ పేరుతో దేశంలో చక్రం చెప్పాలనుకుంటున్నారు కదా, ముందు తనపై గెలిచి చూపించాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే నువ్వే నేరుగా పోటీలోకి దిగు అంటూ రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కు ఛాలెంజ్ చేశారు.

పథకాల విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

పథకాల విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం కోసం నీచ రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త పెన్షన్ లు టిఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇస్తామని లేకుంటే ఆపేస్తాం అని చెప్పడం అనైతికమని మండిపడ్డారు. అకౌంట్ లో వేసిన డబ్బులు ఫ్రీజ్ చేయడంపై న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. అమిత్ షా రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తే కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తామని చెప్పారని పేర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలపై నాకు పూర్తి విశ్వసం ఉంది ... కెసిఆర్ కి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఓటమి భయంతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు

ఓటమి భయంతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు

టిఆర్ఎస్ నేతలు ఓడిపోతామనే భయంతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడులకు, బిజెపి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో బిజెపి ఉన్నా ఇక్కడ ఏనాడు దాడులకు దిగలేదని, ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

English summary
Komatireddy Rajagopal Reddy challenged CM KCR to contest in Munugode if he dares. Rajagopal Reddy made sensational comments that KCR planning for national politics, before that he has to prove his caliber in munugode by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X