నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆందోళన పట్టదు.. విమర్శ చేయడమే లక్ష్యం.. బీజేపీపై సింగిరెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో వరి పంట వేయడం లక్ష్యంగా విమర్శలు కొనసాగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలూ పేలుతున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జిల్లాల పర్యటన మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి సంజయ్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేస్తున్న రైతుల గురించి పట్టించుకోని బీజేపీ నేతలు.. తెలంగాణలో రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు పేరుతో బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు వరి కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్లి వరిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ధాన్యం కొనుగోలు

ధాన్యం కొనుగోలు

4,569 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. యాసంగి ధాన్యం కొంటారో లేదో బిజెపి చెప్పడం లేదు. ధాన్యం కొంటారా ..? కొనరా? మొదట చెప్పండి. కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్లి బీజేపీ ధర్నాలు చేయడానికి సిగ్గుండాలి. రైతుల గురించి మాట్లాడటానికి సిగ్గు శరం ఉందా? ఉత్తరాదిన ఆరు నెలల నుండి రైతులు ధర్నాలు చేస్తుంటే వీళ్లకు కనపడదు. బండి, కిషన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పరు. కరెంటు మీటర్లు పెట్టిస్తున్న పాపాత్ములు, మూర్కులు. నీళ్ల సమస్యను పరిష్కరించకుండా రాజకీయం చేస్తున్న దుర్మార్గులు. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. పక్కా కార్పొరేట్, బిజినెస్ పార్టీ బీజేపీ. రైతుల కోసం చేసిన ఒక్క మంచి మాట బండి చెప్పాలి. బీజేపీ నేతలకు ఇంగిత జ్ఞానం లేదు. యాసంగి వడ్లు మాత్రమే బాయిల్డ్ రైస్. అది కూడా తెలియదా.? రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకెళ్లి కేంద్రాన్ని ఒప్పించాలి" అని మంత్రి అన్నారు.

నిరసనలు

నిరసనలు


ఏడాదిగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తోంటే బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ మూర్ఖపు చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని అన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే చర్యలు బీజేపీ తీసుకుంటోందన్నారు. ప్రజల ఆస్తులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు.

Recommended Video

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ డీకే అరుణ || Oneindia Telugu
పరిశీలన

పరిశీలన


ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పరిశీలించారు. బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసే వరకు కేంద్రాన్ని వెంటాడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ప్రస్తుత వర్షాకాల సీజన్ లో వరి ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీరును ఎండగట్టేందుకు టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో ఈ సీజన్ లో ధాన్యం కొనుగోలు విషయమై లోటుపాట్లను ఎత్తిచూపేందుకు బీజేపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బండి సంజయ్ పరిశీలిస్తున్నారు.

English summary
telangana minister niranjan reddy slams central government on paddy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X