టీఆర్ఎస్ అసంతృప్త నేతల కాళ్లు పట్టుకుంటున్నారు.. కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..!

నల్గొండ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్‌లో లొల్లి షురువైందని.. గులాబీ బాస్ తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి ఎక్కువ కావడంతో తెలంగాణ భవన్‌కు పిలిచి వారు కాళ్లు పట్టుకుని పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలను మోసగించడంలో కేసీఆర్‌ది అందె వేసిన చేయి అని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. రైతులను మోసగిస్తున్న కేసీఆర్‌కు వారి ఉసురు కచ్చితంగా తగులుతుందని ఫైరయ్యారు. యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని.. ఆ క్రమంలో ప్రాణాలు పోయినా సరే లెక్క చేయబోమని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల పేరుతో 3 లక్షల కోట్లు అప్పు చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందంటూ ఆరోపణలు గుప్పించారు.

politics in telangana komatireddy venkat reddy sensational comments on cm kcr

టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి సెగలు ఎక్కువయ్యాయని.. ఇక ఆ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరమని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. టీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ తీరును ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పిన కోమటిరెడ్డి.. సీనియర్ నేతలను కూడా మాయ మాటలతో మభ్య పెట్టడం సరికాదన్నారు. నాయిని నర్సింహా రెడ్డి లాంటి వారినే కేసీఆర్ మోసం చేస్తున్నారంటే.. ఇక ఆ పార్టీలో మిగతావారి పరిస్థితేంటో అర్థమవుతుందన్నారు. అసంతృప్త గళం వినిపిస్తున్న నేతలను తెలంగాణ భవన్‌కు పిలిచి కాళ్లు పట్టుకుని పార్టీలో ఉండాలని బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+