ధర్నాలు ఎందుకు దొర.. కేసీఆర్‌పై షర్మిల నిప్పులు
సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజాప్రస్థానంలో భాగంగా 44వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలోని మిర్యాల క్రాస్ వద్ద పాదయాత్ర ప్రారంభించారు. లింగంపల్లె, మంచన్ పల్లె గ్రామాల మీదుగా సాగి ఆత్మకూరు(ఎస్) మండలంలోని మిడ్తన్ పల్లి గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. అనంతరం కొత్తగూడెం గ్రామంలో వైయస్ షర్మిల గారు ''మాట-ముచ్చట'' నిర్వహించారు.
కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఆయన మోసం చేయని వర్గం లేదు. ఎన్నికల ముందు రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని మోసం చేశారు. దళితబంధు ఇస్తానని మోసం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలను మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. - ఇంటికో ఉద్యోగమని యువతను మోసం చేశారు. నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులనూ మోసం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని మోసం చేశారు. గారడి మాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చి అడుగడుగునా మోసం చేశారని ఫైరయ్యారు.

చివరి గింజ వరకూ వడ్లు కొంటామని.. ఇప్పుడు మాట మార్చి, ఢిల్లీ డ్రామాలు మొదలుపెడుతున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో పండించిన వడ్లను కొనడం చేతకాకే ధర్నాలు చేస్తున్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారు. ఓసారి సన్నొడ్లు వేసుకోవాలని చెప్పాడు. మరోసారి తామే వడ్లు కొంటామని చెప్పాడు. ఇప్పుడేమే వరి వేయొద్దని, కొనమే కొనమని చెబుతున్నాడు. వ్యవసాయాన్ని ఆగం చేసి, రైతుల్ని బానిసలుగా మారుస్తున్నడు. వరి వేయకుంటే తమకు ఉరే గతి అని రైతులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు.
ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు హామీలు గుర్తుకొస్తాయని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ రేట్లు పెంచి పేదల రక్తం తాగుతున్నయ్. పెట్రోల్, డీజిల్, నూనె రేట్లు కేంద్రం పెంచితే.. విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, మున్సిపల్ చార్జీలను రాష్ట్రం ప్రభుత్వం పెంచి, పేదల నడ్డి విరుస్తున్నయని ఫైరయ్యారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications