నూలు.. రసాయనాలు సబ్సిడీ.. నేతన్నలకు వైఎస్ షర్మిల భరోసా
తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శల జడివాన కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు కంటిన్యూ అవుతున్నాయి. ఆదివారం షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చండూర్ క్రాస్ నుంచి ప్రారంభమై రావిగూడెం వరకు సాగింది. మునుగోడు మండలంలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పలు హామీలు గుప్పించారు.

ఇవీ చేస్తాం..
చీరలు నేయడానికి కావలసిన, నూలు రంగులు, రసాయనాలు సబ్సిడీ ధరలకు అందజేస్తామన్నారు. చేనేత కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ తో సంబంధం లేకుండా పెన్షన్ ఇస్తామన్నారు. చేనేత కార్మికులకు ఆరోగ్యభీమాతో పాటు జీవిత భీమా కల్పిస్తాంమని.. నూలు కోసం, రంగుల కోసం, రసాయనాల కోసం, అసుయంత్రం కోసం, సొంత మగ్గాల కోసం సబ్సిడీ రుణాలు అందజేస్తామని.. చేనేత ముడి సరుకులపై జీఎస్టీ ఎత్తివేయడానికి పోరాటం చేస్తామని వివరించారు. చేనేత కార్మికు కుటుంబాలకు నేత పనులకు సంబంధించి అసు యంత్రం వాడే వారికి ఉచిత కరెంటును అందిస్తామని.. మునుగోడు నియోజకవర్గంలో చేనేత నైపుణ్యాన్ని పెంచేందుకు జాతీయ స్థాయి హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్సిట్యూట్ ని ఏర్పాటు చేస్తామని తెలపారు. మునుగోడు చండూరు ప్రాంతానికి ఒక కొత్త చేనేత క్లస్టర్ ని ఏర్పాటు చేస్తామని వివరించారు. చేనేత చీరలకు, బట్టలకు మద్దతు ధర తీసుకువచ్చి.. నేతన్న కష్టానికి ధర వచ్చేలా చేస్తానని చెప్పారు.

కేసీఆర్ రారు
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 30 సార్లు నల్గొండ జిల్లాకు వచ్చారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడున్నర సంవత్సరాలలో ఎన్నిసార్లు వచ్చారని సవాల్ చేశారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చాడు. మిగతా సమయం అంతా ఫాం హౌలో పడుకుని తొంగున్నాడు. ఫ్లోరైడ్ ప్రాంతం అని ఇక్కడ ప్రజల పట్ల ప్రత్యేకంగా వైఎస్ఆర్ దృష్టి పెట్టారని గుర్తుచేశారు. ఎస్ ఎల్ బీసీ ద్వారా 50 కిలోమీటర్లు స్వరంగ మార్గాన్ని తవ్వించారు. ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా తొలగించాలని వైయస్ఆర్ గారు కలలు కన్నారు. 600 గ్రామాలకు నీళ్లు ఇచ్చారు. ఎస్ ఎల్ బీసీ, నాగుల గండీ, ఉదయ సముద్రం, డిండీ ప్రాజెక్టును వైయస్ఆర్ గారు రూపకల్పన చేశారు. ఆయన బతికే ఉంటే ప్రతి ఒక్క ప్రాజెక్టు పూర్తి అయి లక్షల ఎకరాలకు నీరందేదినని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు నల్గొండ ప్రజలను, ప్రాజెక్టులను పట్టించుకున్నారా..? ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు.

ఇలా ఉంది మరీ
డిండీ ప్రాజెక్టుకే దిక్కులేదు. డిండీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే కెనాల్లు మొదలు పెట్టలేదు. శివన్న గూడెం రిజర్వాయర్ కు, క్రిష్ణారాం పట్నం పల్లె రిజర్వాయర్ కు భూములు సేకరించారు. 1200 కుటుంబాలు మా దగ్గరికి వచ్చి మొర పెట్టుకున్నారు. ఎకరానికి 40 లక్షల రూపాయలు ఉంటే 4 లక్షలు ఇచ్చి భూములను గుంజుకున్నారు. సర్కారే దొంగలైతే ప్రజలు ఎవరిదగ్గరకు వెళ్లాలి. 1200 కుటుంబాలు నల్గొండలో రోడ్డున పడ్డారు. మాకు ఉండేందుకు భూమి లేదని వారు వాపోతున్నారు. కేసీఆర్ వల్లే ఈ సమస్య కాదా..? ఈ ప్రాంతంలో చేనేతదారులు చాలా మంది ఉన్నారు. వైయస్ఆర్ గారు చేనేతలకు సబ్సిడీ ఇచ్చారు. చేనేత దారులకు మద్దతు ధర ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. నూలు పోగులు, రంగులకు, ఆసు యంత్రాలకు సబ్సిడీలు, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పద్మశాలీలలకు వృద్దాప్యాంతో సంబందం లేకుండా పింఛన్ ఇవ్వాలి. ఏడెండ్లలో కేసీఆర్ చేనేతలకు చేసిందేమిటి..? మునుగోడు, చెండూరుకు ఒక క్లస్టర్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

మేం చేస్తాం..
రెండేండ్లలో కేసీఆర్ హామీలను నెరవేర్చకపోతే. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ హామీలను నెరవేరుస్తామని చెప్పారు. గీత కార్మికులకు కేసీఆర్ ఎం చేశారు. గీతకారులు బాగుపడ్డారా..? కూలీ చేసి వాల్ల పిల్లలను చదివిస్తే ఉద్యోగాలు లేక చెట్లు ఎక్కి, ఆటోలు నడిపి బతుకుతున్నారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. రుణమాఫీ అని రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిలలకు సున్నావడ్డీకే రుణాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు. ఉద్యమ కారుడని పాలన కేసీఆర్ చేతిలో పెడితే ప్రజలను నట్టేట ముంచేశాడు. నీళ్లు కేసీఆర్ ఫాం హౌస్ కి, నిధులు కేసీఆర్ ఇంటికే, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఎవరైనా బాగుపడ్డారా..? టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరైనా బాగు పడ్డారా..? కేసీఆర్ వరి వేసుకోవద్దని అంటున్నారు. వరి వేసుకోకపోతే రైతులు ఉరివేసుకోవాలా..? ప్రతిపక్షాలు మాత్రం మాట్లాడుతున్నాయా..? కేసీఆర్ లాంటి పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట..

ప్రాజెక్టు వ్యయం పెంచి
33 వేలు ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును లక్ష30వేల కోట్లు చేశారు. వేల కోట్ల కమీషన్ల కోసం ఎత్తిపోస్తున్న నీరును సముద్రంలో కలిపేస్తున్నారు. వరి వేసుకోకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేశారని అడుగుతున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం కోసమా, మీ ఫాం హౌస్ కు నీళ్లు తీసుకునేందుకా.. మీ కమీషన్ల కోసం చేశారా..? రైతుకు ఏ పంట వేసుకోవాలో తెలియదా..? రైతులు మేము ఏం వేసుకోలేమని వ్యవసాయమే మానేస్తామని బాధపడుతున్నారు. రేపు వరి వేసుకోకపోతే వారికున్న అప్పులు బరించలేక వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారి చావులకు కేసీఆర్ ది బాధ్యత కాదా..? పత్తి రైతుల కోసం సీసీఐ నల్గొండలో ఎందుకు లేదు..? రైతులు వ్యవసాయమే మానేయాలా అని అడుగుతున్నా..? రైతులను గాలికి వదిలేసారు. బ్యాంకులో మిత్తి పెరిగి బయట రైతులు అప్పు చేస్తున్నారు. అప్పులు లేని రైతులు తెలంగాణలో లేరు. తల నరికేటోడికే తల్వార్ ఇచ్చినట్టు ఒక కిరాతకున్ని ముఖ్యమంత్రిని చేసుకున్నాం. డిగ్రీ, పీజీలు చదివి ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డిగ్రీ, పీజీలు చదివిన నల్గొండ యువత కూలీలకు పోతున్నారు. ఆ తల్లితండ్రులకు ఎంత మనస్సు క్షోభ.. నా ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నాయి ఎవడు చస్తే నా కెంటి అన్నట్టు ఉన్నారు కేసీఆర్ తండ్రీ, కొడుకులు మాటలు చెప్పే మొనగాల్లే కానీ పూటకు బత్యం ఇచ్చే పుణ్యాత్ములు కారు.

ఇవీ వెతలు
ఆర్టీసీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తే పట్టించుకున్న నాయకులు లేరు. మహిళలలు పోలీస్ స్టేషన్ లో బలై పోతున్నా, లాయర్లను నడి రోడ్డు మీద నరికి చంపుతున్నా అయ్యో అన్న పాపాన పోలేదు. మన్నుతిన్న పాముల్లాగా కేసీఆర్, కేటీఆర్ ఉలకరు పలకరు.. పీనుగుల మీద పేలాలు ఎరుకునే కేసీఆర్ పాలనలో మహిళలల మాన, ప్రాణాలు పనంగా పెట్టి లిక్కర్ ఆదాయంతో తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. లిక్కర్ ఆదాయం 300 శాతం పెరిగింది. ఆడవారి మీద ఆత్యాచారాలు కూడా పెరిగాయి. అయినా కూడా 400 మద్యం షాపులను మళ్లీ ఇప్పుడు తెరిచారు. బీర్లు, బార్ల తెలంగాణగా మార్చారు. చిన్న పిల్లలకు కూడా రక్షణ లేదంటే కేసీఆర్ ఉరివేసుకుని చచ్చిపోవాలి. ఎతా లీడర్ తతా క్యాడర్...లీడర్ ఎలా ఉంటే క్యాడర్ అలానే ఉంటుంది. కేసీఆర్ మహిళలను గౌరవించరు. కేటీఆర్ మహిళలు పోరాటం చేస్తుంటే వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ మంత్రి వర్గంలో వావి వరసలు లేకుండా మరదలు అని మాట్లాడుతారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడే 5 ఎండ్ల చిన్నపిల్లను అత్యాచారం చేసాడంటే కేసీఆర్ ప్రభుత్వానికి అంతకన్నా అవమానం ఉంటుందా..? మీరు మీ మంత్రులు ఉరి వేసుకుని ఒక దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ప్రజల నెత్తిన పాలు పోసిన వాళ్లు అవుతారు.

అప్పుల కుప్ప
మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశాడు. 4లక్షల కోట్ల కేసీఆర్ అప్పు తెచ్చారు. ఆ డబ్బుతో ఎవరికైనా న్యాయం చేశారా..? ప్రతి ఒక్క కుటుంబం మీద 4లక్షల రూపాయల అప్పు ఉంది. ఈ డబ్బంతా కేసీఆర్ కుటుంబం జేబులోకి పోయింది. హుజురాబాద్ లో ఓటుకు 10000 రూపాయలు ఇచ్చారంటే అదంతా ప్రజల డబ్బే. ఇందంతా సరిపోలేదని భూములు అమ్ముకుంటూ పోతున్నారు. ఆర్టీసీ ఆస్తులు, ప్రభుత్వానికి సంబందించిన భూమి ఉందంటే చాలు ఆ ఆస్తిని అమ్మేంత వరకు కేసీఆర్ కు నిద్ర పట్టదు. హైదరాబాద్, చార్మినార్ ను తెలంగాణలో ప్రతి మనిషినీ కూడా కేసీఆర్ అమ్మేస్తారు. కేసీఆర్ గారడి మాటలు విని మళ్లీ మోస పోకండి. కేసీఆర్ గాడిదకు రంగు పూసి అది ఆవు అని నమ్మించ గలరు. ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నా...సమస్యలు లేవని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది కదా..? మాతో పాటు పాదయాత్ర చేసి అభివృద్ధిని చూపించండి. సమస్యలు లేకుంటే నా ముక్కును నేలకురాసి వెళ్లిపోతా.. సమస్యలు ఉంటే రాజీనామాలు చేసి దళితున్ని ముఖ్యమంత్రిని చేయండి.

హామీలు అలానే
ఏడెండ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేదు. ప్రతి పక్షం ఏనాడైనా ప్రశ్నించిందా..? అందరూ కలిసి గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు. అందుకే కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. అందుకే మేం పుట్టాం. ప్రజల తరుపున పోరాడటం కోసం ఈ పార్టీ పుట్టింది. ప్రతి నిరుద్యోగి ఉద్యోగం కోసం, మహిళలను ఆదుకునేందుకు, ఇంట్లో అర్హులైన అందరికీ పింఛన్, రైతు సంక్షేమం తో పాటు కౌలు రైతులకు కోసం, ఎస్టీ, ఎస్సీల బాగు కోసం వైయస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకురావడం కోసమే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆత్మహత్యలు ఆగాలి..అభివృద్ధి జరగాలి. ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి, పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించారు. 108 సేవలు ప్రవేశపెట్టి, 20 నిమిషాల్లో ఇంటి వద్దకే అంబులెన్స్ వచ్చేలా చేశారు. ఐదేండ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 45లక్షల ఇండ్లు నిర్మిస్తే.. వైయస్ఆర్ గారు ఒక్కరే రాష్ట్రంలో 46లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని మొట్టమొదటి ఆలోచన చేసిందే వైయస్ఆర్ గారు.
Recommended Video

ఇప్పుడు ఇలా
మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేదింటి పిల్లలకు ఉన్నత విద్య అందించారు. ఎంతోమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. వైయస్ఆర్ గారు అన్ని సంక్షేమ పథకాలను అద్భుతంగా నడిపించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఐదేండ్ల కాలంలో నిరుద్యోగుల కోసం మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇవే కాక ప్రైవేటు రంగంలో 11లక్షల ఉద్యోగాలను సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించారు. ఐదేండ్లలో ఒక్క పన్ను పెంచకుండా పాలన సాగించిన రికార్డు ముఖ్యమంత్రి మన వైయస్ఆర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వైయస్ఆర్ గారు చేసి, చూపించారు. వైయస్ఆర్ గారు ఎప్పుడూ పేద పిల్లల గురించే ఆలోచించేవారు.












Click it and Unblock the Notifications