తల్లి పులి కోసం తల్లడిల్లుతున్న నాలుగు పులికూనలు; తల్లి చెంతకు చేరేనా?
పెద్ద గుమ్మాడ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన తల్లి పులి కోసం తల్లడిల్లుతున్న నాలుగు పులికూనలను తల్లి చెంతకు చేర్చటానికి అటవీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
కర్నూలు: ప్రేమ ఎవరిలోనైనా ప్రేమే.. అది జంతువులైనా.. మనుషులైనా .. తల్లి ప్రేమను మించింది మరేది లేదు అని చెప్తే అతిశయోక్తి కాదు. అటువంటి తల్లి ప్రేమ కోసం, తల్లి కోసం విలవిలలాడుతున్నాయి నాలుగు పులికూనలు. రెండు రోజులుగా జాడలేని తమ తల్లి కోసం కలవరం చెందుతున్నాయి. దిగాలుగా అమ్మ ఎప్పుడొస్తుంది అంటూ ఎదురు చూస్తున్నాయి.
తల్లి చెందకు చేర్చేందుకు అధికారులు ముమ్మరయత్నాలు చేస్తున్నా, ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. అమ్మ కోసం ఎదురుచూస్తున్న ఈ పసి పులికూనలు తల్లిని చేరుతాయా లేదా అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠను కలిగిస్తుంది.
తప్పిపోయిన తల్లి పులి కోసం అటవీ అధికారుల గాలింపు
ఇంతకీ ఏం జరిగిందంటే నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడ శివార్లలో నాలుగు పిల్లలతో పులి వచ్చింది. ఆపై పులి జాడ రెండు రోజులైనా కనిపించడం లేదు. ఎక్కడైతే తల్లి పులి తప్పిపోయిందో అక్కడి నుండి రెండు కిలోమీటర్ల పరిధిలో 70 ఇన్ఫ్రారెడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి, ముందు తల్లిపులిని గుర్తించి, ఆపై ఆ ప్రాంతానికి పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

తల్లి చెంతకు నాలుగు పులి కూనలను చేర్చే యత్నం
మొదట తల్లిపులిని గుర్తించి అక్కడకు పులి కూనులను చేర్చుతారు. ఒక చిన్న ఎన్ క్లోజర్ లో ఉంచి పులి పిల్లలను తల్లి పులి దగ్గరలో వదిలిపెడతారు. ఒకవేళ తల్లి దగ్గరకు వస్తే పులి పిల్లలను ఎన్ క్లోజర్ నుంచి బయటకు వదులుతారు. ఒకవేళ రాకపోతే ఆ పులి పిల్లలను కాపాడడం అధికారులకు సవాలే.
సహజంగా పెద్ద పులి , దొమ్మల గొండి హైనా ..తన బిడ్డలకు మనిషి స్పర్శ తగిలితే తిరిగి చేరదీయదు. ఇక పులి కూనలను స్థానికంగా ఉన్న ప్రజలు ముట్టుకొని, పట్టుకొని ఫోటోలు తీసుకుని వాటితో ఆటలాడుకోవడం వంటి పనులు చేశారు. దీంతో పులికూనలను తల్లి అక్కున చేర్చుకుంటుందా? చేర్చుకునే అవకాశం లేదు అని నిపుణులు భావిస్తున్నారు.

మనిషి ముట్టిన వాసన తెలిస్తే తల్లి బిడ్డలను చేరదీయదు.. గుర్తించకుండా అధికారుల యత్నం
అంతేకాదు తల్లి చెంతకు చేర్చటంలో జాప్యం జరిగితే కూడా తల్లి వాటిని మర్చిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక మనిషి ముట్టిన వాసన నుంచి గుర్తుపట్టకుండా ఉంచటం కోసం అటవీ అధికారులు పులి పిల్లల మూత్రాన్ని సేకరించి దాంతో పులి పిల్లల ఒంటిని తడపనున్నారు. సాధారణంగా పెద్ద పులులు ఒక కాన్పులో మూడు పిల్లల్ని కంటాయి.
వీటిలో మగ, ఆడకూనలు ఉంటాయి. ఇక కన్న పులికూన బిడ్డలలో రెండు మాత్రమే బ్రతికే అవకాశం ఉంటుంది. అయితే గుమ్మడా పురం లో ఏకంగా ఒకే ఈతలో నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడంతో అటవీ శాఖ అధికారులు సంబరాలు జరుపుకున్నారు. పులుల సంతతిని పెంచడంలో ఆడ పులులదే పాత్ర కావడంతో, నాలుగు ఆడ పులికూనలు కావడంతో పులుల సంతతి పెరుగుతుందని అనుకున్నారు.

తల్లి పులి ఎక్కడుంది? పసి పులి కూనలను చేరదీస్తుందా?
కానీ ఇప్పుడు తల్లిపులి నాలుగు పులికూనలను వదిలి తప్పిపోవడంతో తల్లి పులి వద్దకు పులికూనలను చేర్చకపోతే, ఆ పులి కూనలను పెంచడం కష్టమవుతుందని భావిస్తున్నారు. జూలో ఉంచి వాటిని పెంచడం కంటే తల్లి వద్దకు చేరిస్తేనే అవి ఆరోగ్యంగా, హాయిగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా తల్లి చెంతకు పులి కూనలను చేర్చడానికే తమ మొదటి ప్రాధాన్యత అని చెబుతున్నారు. మరి తల్లి పులి కంట పడుతుందా? నాలుగు పులి కూనలను తన బిడ్డలుగా చేరదీస్తుందా? తెలియాల్సి ఉంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications