ఆ బాలుడు ఏమైనట్లు-అడవిలోనే చిక్కుకుపోయాడా-ఎనిమిదో రోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు

నెల్లూరు జిల్లా ఉయ్యాలపల్లికి చెందిన మూడేళ్ల బాలుడు సంజు అదృశ్యం సంచలనం రేపుతోంది. బాలుడు అడవిలోకి వెళ్లాడా... లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా... అన్నది ఇంకా తేలలేదు. అడవిలోకి వెళ్లి ఉండొచ్చునన్న అనుమానంతో పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. డ్రోన్లతో బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం(జులై 6) పోలీస్ జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

జాగిలాన్ని రంగంలోకి దించినా...

జాగిలాన్ని రంగంలోకి దించినా...

బాలుడి ఇంట్లో అతని దుస్తులు,చెప్పులను వాసన చూసిన జాగిలం పెనుశిల అడవిలోకి పరుగుతీసింది. అడవిలో ఉన్న స్వర్ణముఖి కాలువ వద్ద ఆగడంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. అయినప్పటికీ బాలుడి ఆచూకీ దొరకలేదు. పెనుశిల అభయారణ్యంలో విష సర్పాలు,ఎలుగుబంట్లు,కృూర జంతవులు సంచరిస్తుంటాయి. దీంతో అడవిలో బాలుడు ఎలా ఉన్నాడోనని అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.బాలుడు అదృశ్యమై 8 రోజులు కావడంతో... ఏం తింటున్నాడో,తాగుతున్నాడోనని వారు ఆవేదన చెందుతున్నారు.

ఎవరైనా ఎత్తుకెళ్లారా...?

ఎవరైనా ఎత్తుకెళ్లారా...?

పెనుశిల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని జాతీయ రహదారి ఉంది. ఒకవేళ బాలుడు ఏడుస్తూ ఆ రోడ్డు వైపు వెళ్తే... ఎవరైనా అతన్ని తీసుకెళ్లి ఉంటారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాలుడు అదృశ్యమవడానికి ముందు రోజు ఉయ్యాలపల్లి గ్రామంలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో చిరు వ్యాపారులు గ్రామానికి తరలివచ్చారు. వీళ్లలో ఎవరైనా బాలుడిని తీసుకెళ్లి ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆరోజు గ్రామానికి వచ్చిన చిరు వ్యాపారుల ఫోన్ నంబర్లను పోలీసులు సేకరిస్తున్నారు.

పోలీసులు ఏమంటున్నారు...

పోలీసులు ఏమంటున్నారు...


ఉయ్యాలపల్లితో పాటు పరిసర ప్రాంతాలు,చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పొరుగు గ్రామాలకు చెందిన యువకులను సైతం బృందాలుగా ఏర్పాటు చేసి ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగస్వాములను చేశారు. బాలుడు సజీవంగానే ఉన్నాడని స్థానిక పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాలుడు సంజు క్షేమంగా తిరిగిరావాలని ఉయ్యాలపల్లి గ్రామస్తులు కోరుకుంటున్నారు.

జూన్ 29న అదృశ్యం...

జూన్ 29న అదృశ్యం...

ఉయ్యాలపల్లి గ్రామంలోని అరుంధతి కాలనీకి చెందిన సంజు గత నెల 29న అదృశ్యమయ్యాడు. బాలుడి తండ్రి బుజ్జయ్య మేకలు కాస్తుంటాడు. ప్రతీరోజూ బుజ్జయ్య మేకల మందను అడవిలోకి తోలుకెళ్లే సమయంలో.... సంజు కూడా ఇంటి నుంచి కొంత దూరం అతనితో పాటు వెళ్లేవాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికొచ్చేవాడు. కానీ జూన్ 29న తండ్రి వెనకాలే వెళ్లిన సంజు... ఆ తర్వాత మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో సంజు అడవిలోకే వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+