నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: మూడు వాహనాల బీభత్సం; ఏడుగురు దుర్మరణం!!
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొట్టడంతో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొట్టాయి. ఈరోజు తెల్లవారుజామున మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది.
ఇక ఇదే సమయంలో ఎదురుగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు రావడంతో లారీ అదుపు తప్పి ట్రావెల్ బస్సు పైకి దూసుకు వెళ్ళింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా, 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని వారిని బయటకు తీసేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు గా మారింది. ఈ ఘటనలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications