నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కవిత కోసం అన్నాతమ్ముల పోరాటం.. నిజామాబాద్ లో కాక పుట్టిస్తున్న రాజకీయం

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ అధికార టిఆర్ఎస్, బిజెపిల మధ్య రగడ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ నుంచి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు. ఇక కరోనా లాక్డౌన్ కారణంగా ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. ఇక ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో బిజెపికి చెక్ పెట్టడానికి టిఆర్ఎస్, గులాబీ పార్టీని ఇరకాటంలో పెట్టటానికి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

 బీజేపీది బొంద మీది ప్యాకేజ్ ... మంత్రి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు బీజేపీది బొంద మీది ప్యాకేజ్ ... మంత్రి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు

నిజామాబాద్ లో బీజేపీకి చెక్ పెట్టే పనిలో టీఆర్ఎస్ .. ఆపరేషన్ ఆకర్ష్

నిజామాబాద్ లో బీజేపీకి చెక్ పెట్టే పనిలో టీఆర్ఎస్ .. ఆపరేషన్ ఆకర్ష్

నిజామాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. అందులో టిఆర్ఎస్ ఓట్లు 592 కాగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల సంఖ్య 142, బిజెపి ఓటు బ్యాంకు 90 గా ఉంది. గత ఎంపీ ఎన్నికల్లో కెసిఆర్ కుమార్తె కవిత ను ఓడించి,బిజెపి నుండి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ ఎంపీగా విజయం సాధించారు. దీంతో స్థానికంగా బిజెపి పట్టు పెంచుకోవడానికి బాగానే ప్రయత్నం చేశాడు. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన కవిత స్థానికంగా బీజేపీని బలహీనం చేయడంపై దృష్టిసారించింది. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు గులాబీ పార్టీ పదును పెట్టినట్లుగా సమాచారం.

ఎంపీ ధర్మపురి అరవింద్ ను దెబ్బకొట్టేందుకు రంగంలోకి సోదరుడు ధర్మపురి సంజయ్

ఎంపీ ధర్మపురి అరవింద్ ను దెబ్బకొట్టేందుకు రంగంలోకి సోదరుడు ధర్మపురి సంజయ్

ఇప్పటికే బిజెపి కార్పొరేటర్లకు గాలం వేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది టిఆర్ఎస్ పార్టీ. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ను దెబ్బకొట్టేందుకు అతని సోదరుడు ధర్మపురి సంజయ్ ను రంగంలోకి దించింది. బిజెపి కార్పొరేటర్లకు సన్నిహితంగా ఉండే ధర్మపురి సంజయ్ వారిని కారు ఎక్కించే పనిలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల తాయిలాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే నలుగురు బిజెపి కార్పోరేటర్లు గులాబీ పార్టీ బాట పట్టారు.

అఫిడవిట్ లో తప్పుడు వివరాలని కవితపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు

అఫిడవిట్ లో తప్పుడు వివరాలని కవితపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి పదిమంది కార్పొరేటర్లను కారు ఎక్కించడమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ ,ఆ పార్టీ కోసం పని చేస్తున్న ఎంపీ అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసిన కల్వకుంట్ల కవిత అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చారని బిజెపి ఆరోపిస్తోంది. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఆపార్టీ ఫ్లోర్‌ లీడర్‌ రామచందర్‌రావు ఫిర్యాదు చేశారు.

బీజేపీ నేతలను ప్రలోభపెడుతున్నారని ఆగ్రహం ..

బీజేపీ నేతలను ప్రలోభపెడుతున్నారని ఆగ్రహం ..


కరోనాకారణంగా ఎమ్మెల్సీ ఎన్నికను వాయిదా వేస్తే ఇక ఈ సమయాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లు, జెడ్పిటిసిలను ప్రలోభపెడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే బిజెపి విమర్శల పై టిఆర్ఎస్ పార్టీ సైతం రివర్స్ కౌంటర్ ఇస్తోంది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఒంటెద్దు పోకడలతో పార్టీలో ఉండలేక చాలామంది పార్టీని వినడానికి సిద్ధంగా ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు.

Recommended Video

Telangana Woman Rides Scooter For 1,400 KM to Get Son Back Home Amid Lockdown
విమర్శలు తిప్పికొడుతున్న టీఆర్ఎస్ .. కాక పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయం

విమర్శలు తిప్పికొడుతున్న టీఆర్ఎస్ .. కాక పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయం


ఎన్నికల్లో గెలిచేందుకు తగినంత బలం లేకపోవడంతో ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరుతున్నారని, ఎవర్నీ ప్రలోభపెట్టాల్సిన అవసరం తమకు లేదని వారంటున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగవలసి ఉన్న నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ తో టిఆర్ఎస్, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులతో బిజెపి ఎవరికి వారు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు. ఎంపీ ఎన్నికలతో నిజామాబాద్ మీద పట్టు సాధించామనుకుంటున్న బీజేపీకి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా పని చేస్తున్నారు కెసిఆర్ తనయ, కల్వకుంట్ల కవిత.

English summary
trs local body mlc candidate kalvakuntla kavitha trying to bjp weak in the constituency . trs party put the MP Arvind's brother Dharmapuri Sanjay in the spotlight to check to Arvind. Dharmapuri Sanjay, who is close to BJP corporators, is in the process of defections. They offering 30 lakhs to 50 lakhs to each corporator. Four BJP corporators have already joined into trs party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X