తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్మూర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆర్మూర్ ఒకటి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి గెలుపొందారు. జీవన్ రెడ్డి తన సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత కేఆర్ సురేష్ రెడ్డిపై 13,964 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జీవన్ రెడ్డికి 65,555 ఓట్లు రాగా, సురేష్ రెడ్డికి 53,591 ఓట్లు వచ్చాయి. 1957 నుంచి 1983 వరకు కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) గెలిచింది. ఆ తర్వాత 1985లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, 1994లో టీడీపీ, 1999లో కాంగ్రెస్, 2004లో టీఆర్ఎస్, 2009లో టీడీపీ, 2014లో టీఆర్ఎస్ గెలిచింది.













Click it and Unblock the Notifications